పబ్ వ్యవహారం మీద స్పందించిన హేమ.. ఫోన్ చేస్తే పారిపోయాడు అంటూ!

సరిగ్గా ఉగాది రోజున హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక పబ్ మీద రైడ్ చేయడం సంచలనంగా మారింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన సమయంలో నటి హేమ కూడా పబ్ లో ఉంది అంటూ కథనాలు రావడంతో హేమ రంగంలోకి దిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి తాను పబ్ కి వెళ్ళలేదు అని మీడియాకు క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఈ విషయం మీద ఒక ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

వెళ్ళలేదు

వెళ్ళలేదు

తాను సరదాగా పబ్ కి వెళ్లడం అలవాటే కానీ ఈ ఉగాది రోజు పబ్ కి వెళ్ళ లేదని ఆమె చెప్పుకొచ్చారు. పబ్ కి వెళ్లకపోయినా వెళ్లినట్లు ఎలా తన పేరు బయటకు వచ్చింది అనేది తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే విషయాన్ని ఒక ఛానల్ లో ప్రముఖంగా ప్రస్తావిస్తూ న్యూస్ రావడంతో తాను ఆ ఛానెల్ వద్ద కూడా వెళ్లి ప్రశ్నించా అని చెప్పుకొచ్చారు. ముందుగా ఆ చానల్ రిపోర్టర్ కి ఫోన్ చేస్తే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని ఆమె పేర్కొన్నారు.

నిలదీయలేకపోయారు

నిలదీయలేకపోయారు

మీడియా ప్రతినిధుల మధ్య మంచి స్నేహం ఉందని, అతని గురించి ప్రశ్నిస్తూ నేను మీడియా ముందు మాట్లాడబోతే మైకులు ఆఫ్ చేయండి టెలికాస్ట్ ఆపండి అంటూ వాళ్ళు వెనక్కి తగ్గారు అని వాళ్ళ స్నేహితుల కోసం వాళ్ళు ఆలోచించారు కానీ అసలు అక్కడ లేని తన పేరు ఎందుకు ప్రస్తావించారు అనే విషయం మీద వాళ్ళు నిలదీయలేకపోయారు అని ఆమె అన్నారు.

సిగ్గుచేటు మరేదైనా ఉంటుందా

సిగ్గుచేటు మరేదైనా ఉంటుందా

నిజానికి ఆ సమయంలో తాను తన భర్తతో వేరే చోట ఉన్నాను అని నిజంగా ఆరోజు పబ్ కి వెళ్లి ఉంటే ఒప్పుకునే దాన్ని అని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఆ ఛానల్ మీద, రిపోర్టర్ మీద కేసు పెట్టాను అని ఆ కేసు విషయంగా మహిళా ఎస్సై సదరు రిపోర్టర్ కి ఫోన్ చేస్తే అది రాంగ్ నెంబర్ అని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారని ఇంతకన్నా సిగ్గుచేటు మరేదైనా ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు.

పోరాడుతూ ఉంటే

పోరాడుతూ ఉంటే

ఒక ఆడపిల్లని అయి ఉండి నేను నా పరువు కోసం ఇంత పోరాడుతూ ఉంటే ఇప్పటికి కూడా ఆ రిపోర్టర్ తనకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఆసక్తి చూపించడం లేదని, పోలీసు స్టేషన్ కు రమ్మంటే రాకుండా పారిపోయాడు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అందుకే సదరు రిపోర్టర్ మీద అలాగే ఛానల్ మీద కూడా ఆమె పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.

పరువు నష్టం దావా

పరువు నష్టం దావా

ఇక మీదట ఎవరు కూడా ఇలా అనవసరంగా పేర్లు లాగి ఇబ్బంది పెట్టకూడదు అని ఆమె అన్నారు. అసలు హేమ అనే పేరు పూర్తిగా లిస్ట్ లోనే లేదని మరి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తనకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదని ఆమె అన్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎంత దాకా వెళుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X