twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విరుచుపడ్డ నటి హేమ: ఇండస్ట్రీలో డాష్ ముండలు.. పవన్ తల్లిని అంటే మహిళా సంఘాలు ఏమయ్యాయి!

    |

    Recommended Video

    Sri Reddy Issue : Hema Talked To Media People

    కొద్ది సేపటి క్రితమే మెగా బ్రదర్ నాగబాబు టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన కాస్టింగ్ కౌచ్, పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు వంటి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనేక విషయాలపై ఆయన వివరణ ఇచ్చారు. నాగబాబు మాట్లాడిన తరువాత ప్రముఖ నటి హేమ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఒకరంగా ఇండస్ట్రీని దూషిస్తున్న వారిపై ఆమె విరుచుపడ్డారని చెప్పొచ్చు. ఏం జరిగినా తమని దూషిచడం సరికాదని ఆమె అన్నారు.

    డాష్ ముండలు లేరా అన్నాడు

    డాష్ ముండలు లేరా అన్నాడు

    ఇండస్ట్రీలో డాష్ ముండలు లేరా అంటూ టివీ5 ఛానల్ యాంకర్ మాట్లాడిన మాటని హేమ తప్పుబట్టారు. దీని కోసం బాగా శిక్షణ పొంది న్యూస్ ఛానల్స్‌లో న్యూస్ రీడర్స్ అయ్యారని హేమ ఎద్దేవా చేశారు.

    ఆవిడకేనా పర్సనల్ విషయాలు

    ఆవిడకేనా పర్సనల్ విషయాలు

    హేమ మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా శ్రీరెడ్డి గురించి వ్యాఖ్యలు చేసారు. టివి ఛానల్స్‌లో డిబేట్లు నిర్వహించేవారు ఆవిడ పర్సనల్ విషయాలు ఎత్తకండి అంటారు. ఆమెకేనా పర్సనల్ విషయాలు.. మాకు కుటుంబాలు లేవా అని హేమ ప్రశ్నించారు. ఆర్టిస్టులు అయిన పాపానికి మా కుటుంబాలు డాష్ అయిపోవాలా అని ప్రశ్నించారు.

     ఐకమత్యం పెరుగుతోంది

    ఐకమత్యం పెరుగుతోంది

    ఈ సంఘటన పుణ్యమా అని మా చిత్ర పరిశ్రమలో ఐకమత్యం పెరుగుతోందని హేమ అన్నారు. ఇలా న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు పెడుతూ ఇండస్ట్రీని దూషించడం వలన తామంతా ఒక్కటి అవుతున్నామని అంతా మీ పుణ్యమే అని టీవీ ఛానల్స్ ని ఉద్దేశించి అన్నారు.

    పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల గురించి

    పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల గురించి

    ఇలాంటి క్యారెక్టర్లు ఇంకో నలుగురిని తీసుకుని వచ్చి మిగిలిన హీరోల తల్లులని కూడా తిట్టించండి సరిపోతుంది అంటూ శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలని పరోక్షంగా ప్రస్తావించారు. అలా చేస్తే తాము ఇంకా ఐకమత్యంగా మారుతామని హేమ అన్నారు.

     అలాంటి జాబ్ చూపించండి

    అలాంటి జాబ్ చూపించండి

    ఈ రంగంలో ఆడవారికి భద్రత ఉందని మీడియా ఛానల్స్ వారు ప్రకటన ఇవ్వండి. ఆధారం అక్కడికే వెళ్లి ఉద్యోగాలు చేస్తాం అని హేమ అన్నారు. బస్టాండ్ లో నిలుచున్నా కూడా ఆడవారికి భద్రత ఉండడం లేదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేట్ సంస్థలు ఎక్కడా కూడా ఆడవారికి భద్రత ఉండడం లేదని అలాంటప్పుడు ఒక్క చిత్ర పరిశ్రమనే దూషించడం ఏంటని ఆమె అన్నారు.

    మహిళా సంఘాలు ఇప్పుడు ఎక్కడ

    మహిళా సంఘాలు ఇప్పుడు ఎక్కడ

    చలపతి బాబాయ్ ఒక్క మాట అంటే మహిళాసంఘాలు ఆయన్ని దులిపేశాయని హేమ అన్నారు. అలాంటిది ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ తల్లిని అంత పెద్ద మాట అనేసింది. మహిళా సంఘాలు ఏమయ్యాయని హేమ ప్రశ్నించారు. మగవాళ్ళు తిడితేనేనా తిట్టు.. ఆడవాళ్లు తిడితే తిట్టు కాదా అని హేమ మహిళా సంఘాలని మీడియా ద్వారా అడిగారు.

    English summary
    Actress Hema responds on Srireddy issue. Hema fires on News Channels
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X