హేమ‌కు బూతు మెసేజ్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్‌ : సినీనటి హేమ సెల్‌ఫోన్‌కు అసభ్య పదజాలంతో సంక్షిప్త సందేశాలు పంపిన వ్యక్తిని మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర మేసేజ్ పంపుతూ వేధిస్తుండటంతో ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతని పోన్ నెంబర్ ట్రేస్ చేయడం ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.

నిందితుడిని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మధుగా గుర్తించారు. ఇతడు గతంలో ఇలాంటి కేసుల్లో శిక్ష అనుభవించినట్లు సమాచారం. అతన్ని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, విచారణ అణంతరం సైబర్ క్రైం క్రిమినల్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.

నిందితుడు ఫోన్ నెంబర్ స్విఛాఫ్ చేసి ఉంచటంతో అతని నెంబర్ ఆధారంగా కాల్ డేటాను సేకరించి పట్టుకున్నట్లు మాదాపూర్ ఇన్సపెక్టర్ తెలిపారు. పదవ తరగతి ఫెయిల్ అయిన అతనిపై గతంలోనూ ఇలాంటికంప్లైంట్స్ ఉన్నాయి. ఇతనిపై సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పారు.


పోలీసుల కథనం ప్రకారం...స్లైడ్ షో లో..

పోలీసులు కేసు గురించి చెప్తూ...

పోలీసులు కేసు గురించి చెప్తూ...

నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన చిట్టిప్రోలు మధు(27) కిరాణా దుకాణం నిర్వహిస్తుంటాడు. మాదాపూర్‌లో నివసించే సినీనటి హేమ సెల్‌ నంబరు సేకరించాడు. తరచూ ఆమెకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడడం చేస్తున్నాడు.

తప్పు అని తేలాయి

తప్పు అని తేలాయి

హేమ ఫోన్‌ తీయకపోతే అసభ్య పదాలతో కూడిన సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాడు. అనంతరం ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన హేమ గత నెల 27న మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఫోన్‌ నంబరు ఆధారంగా చిరునామా, పేర్లను ఆరా తీయగా అవి తప్పు అని తేలాయి.

ఎట్టకేలకు ...

ఎట్టకేలకు ...

టవర్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడు గతంలో కూడా పలువురు మహిళలకు ఇదే విధంగా ఫోన్‌చేయడం, సంక్షిప్త సందేశాలు పంపడంతో నల్గొండ పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచ్చారు. ఈ నెల 14న జైలు నుంచి విడుదలైనట్లు పోలీసులు తెలిపారు.

హేమగురించిన వివరాల్లోకి వెళితే...

హేమగురించిన వివరాల్లోకి వెళితే...

1989లో నటిగా కెరీర్‌ ప్రారంభించిన హేహ, వివాహం కారణంగా నటనకు 1993లో బ్రేక్‌ యిచ్చింది. 1997లో నటిగా పున:ప్రవేశం చేసి, ఇటు కామెడీ రోల్స్‌, అటు కేరక్టర్‌ రోల్స్‌ ద్వారానూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి వరకు 300పైగా చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X