త్రివిక్రమ్ నా గాడ్ ఫాదర్.. అంతా వెధవల్లాగా, మా మధ్య ఏం జరిగిందంటే!

Recommended Video

Hema Gives Clarity On Differences With Trivikram || Filmibeat Telugu

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమకు మంచి క్రేజ్ ఉంది. తల్లి, వదిన, గయ్యాళి ఆడపడుచు లాంటి పాత్రల్లో రాణిస్తూ హేమ దూసుకుపోతోంది. హేమ పేరు చెప్పగానే అతడు, నువ్వు నాకు నచ్చావ్, జులాయి లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. చిత్ర పరిశ్రమలో జరిగే అన్ని కార్యక్రమాల్లో హేమ చురుగ్గా పాల్గొంటుంది. హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య ఏర్పడిన వివాదం గురించి వివరించింది. త్రివిక్రమ్ పై తాను చేసిన వ్యాఖ్యలని నెగిటివ్ గా చూపిస్తూ కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ఘాటుగా స్పందించింది.

త్రివిక్రమ్ నా గాడ్ ఫాదర్

త్రివిక్రమ్ నా గాడ్ ఫాదర్

హేమ మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు టాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చిత్రాల వల్లే నాకు ఇంత క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే తాను రాజకీయాల్లోకి కూడా వెళ్లగలుగుతున్నానంటూ హేమ వ్యాఖ్యానించింది. నువ్వు నాకు నచ్చావ్ చిత్రం నుంచి నాకు ఆయన అవకాశాలు ఇస్తున్నారు. నెక్స్ట్ మూవీ లో నాకు ఓ పాత్ర రాయండి అని ధైర్యంగా నేను అడగగలిగే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే అని హేమ తెలిపింది.

ప్రోమో చూసి

ప్రోమో చూసి

ఓ ఇంటర్వ్యూలో నేను త్రివిక్రమ్ పై అలిగిన విషయాన్ని చెప్పా. ఓ ప్రముఖ మీడియా సంస్థ కేవలం ఆ ఇంటర్వ్యూ ప్రోమో చూసి త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ పై హేమ సంచలన వ్యాఖ్యలు అంటూ డిబేట్ పెట్టేసింది. అసలు నేను పూర్తిగా ఏం మాట్లాడానో తెలుసుకోకుండా నాపై నెగిటివ్ ప్రచారం చేశారు. నాకు గాడ్ ఫాదర్ లాంటి త్రివిక్రమ్ గారిని నేనెందుకు తిడతాను అని హేమ ప్రశ్నించింది.

 అంతా వెధవల్లాగా

అంతా వెధవల్లాగా

కొందరు నిజాలు తెలుసుకోకుండా వార్తలు వేస్తున్నారు. వెధవల్లాగా తయారయ్యారు అంటూ హేమ ఘాటుగా కామెంట్స్ చేసింది. మీ గురించి నిజాలు తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా అని హేమ తెలిపింది. ఇండస్ట్రీ నాకు తల్లిలాంటిది. నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను అని హేమ తెలిపింది.

మా మధ్య ఏం జరిగిందంటే

మా మధ్య ఏం జరిగిందంటే

త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు నా రెమ్యునరేషన్ విషయంలో తల దూర్చారు. ఈ విషయాన్ని త్రివిక్రమ్ కు చెప్పా. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో అలిగా. అలా మా మధ్య చిన్న మనస్పర్ధ ఏర్పడింది. ఆ తర్వాత తప్పు తన అసిస్టెంట్ డైరెక్టర్‌దే అని తెలుసుకుని త్రివిక్రమ్ అతడిని తీసేశారు. ఇది జరిగిన విషయం. ఇందులో నేను త్రివిక్రమ్‌ని తిట్టినట్లు అనిపిస్తోందా అని హేమ ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X