మహేష్ బాబు నాకు మగాడు అనిపించింది అప్పుడే.. అంతకు ముందు అమూల్ బేబీ.. హేమ!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమకు మంచి క్రేజ్ ఉంది. తల్లి, వదిన, గయ్యాళి ఆడపడుచు లాంటి పాత్రల్లో రాణిస్తూ హేమ దూసుకుపోతోంది. హేమ పేరు చెప్పగానే అతడు, నువ్వు నాకు నచ్చావ్, జులాయి లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. చిత్ర పరిశ్రమలో జరిగే అన్ని కార్యక్రమాల్లో హేమ చురుగ్గా పాల్గొంటుంది. హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో తాను సరదగా ఉంటానని హేమ అంటోంది. మహేష్ బాబుకు, తనకు మధ్య జరిగిన కొన్ని సరదా సంభాషణల్ని హేమ వెల్లడించింది.

నీ ముఖం కనిపించదు

నీ ముఖం కనిపించదు

హేమ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో కలసి పలు చిత్రాల్లో నటించా. మేకప్ సరిగా ఉందా లేదా అని అద్దంలో చూసుకుంటుంటే.. నీ ముఖం అద్దంలో కనిపించదులే.. అని మహేష్ బాబు జోక్ వేశారు. మహేష్ బాబు ఎవరితోనూ జోకులు వేయరు.. ఒక్క నాతో తప్ప అని హేమ తెలిపింది. నేను కూడా అంతే సరదాగా సమాధానం ఇచ్చా. ఏంటి బాబు ఇలా లావైపోతున్నారు అని అడిగా. నేను లావుగా ఉన్నానా.. అతడు సినిమాలో ఇంతకంటే లావుగా ఉన్నాను తెలుసా అని అన్నారు.

మహేష్ బాబు మగాడు అనిపించింది అప్పుడే

మహేష్ బాబు మగాడు అనిపించింది అప్పుడే

అతడు సినిమాలో మిమ్మల్ని ఎవరు చూశారు బాబు అని సరదాగా సెటైర్ వేశా. అదేంటి అంత మాట అనేశావు అని అన్నారు. నిజమే కదా.. అతడులో చాక్లెట్ బాయ్ లాగా, అమూల్ బేబీలాగా ఉంటారు. నాకసలు మ్యాన్లీగా అనిపించలేదు, అందుకే మిమ్మల్ని పట్టించుకోలేదు అని అన్నా. హవ్వ ఏంటా మాటలు అని అన్నారు. అయితే ఎప్పటి నుంచి పట్టించుకోవడం ప్రారంభించావు అని అడిగారు. నాకు పోకిరి తర్వాత మగాడిలా అనిపించారు. అప్పటి నుంచే ఫాలో కావడం ప్రారంభించా అని అన్నా. ఇలా ఎప్పుడూ మా మధ్య జోకులు పేలుతూనే ఉంటాయని హేమ తెలిపింది.

చిన్నప్పటి నుంచి అంతేనా

చిన్నప్పటి నుంచి అంతేనా

మీకు ఈ తింగరతనం ఎప్పటి నుంచి ఉంది.. చిన్నప్పటి నుంచి అంతేనా అని మహేష్ అడిగారు. అంతలా తింగర చేష్టలు చూస్తుంటానని హేమ తెలిపింది. చిరంజీవిగారు కూడా నాపై జోకులు వేస్తుంటారని హేమ తెలిపింది. చిరంజీవి అందరితో పాటే సెట్స్ లో కూర్చుంటారు. మాతో పాటే కూర్చున్న రాజా రవీంద్ర నా గురించి చిరంజీవిగారికి చెబుతూ.. హేమ కూతురు చాలా తెలివైంది సర్.. ఈమె తింగర చేష్టలు వాళ్ళ కూతురికి రాలేదు అని అన్నారు. సర్ నేను మరీ అంత తింగరదానిలా కనిపిస్తానా అని చిరంజీవిగారిని అడిగాను. లేదమ్మా ఎవరికి వాళ్ళు తెలివైన వాళ్లే అనుకుంటుంటారు అంటూ ఆయనకూడా నాపై సెటైర్ వేశారు.

పవన్ కళ్యాణ్ కూడా నాలాగే

పవన్ కళ్యాణ్ కూడా నాలాగే

పవన్ కళ్యాణ్ కూడా నా నటన గురించి ప్రత్యేకంగా అభినందిస్తుంటారు. అన్నవరం చిత్రంలో తాళి తెంపేసే సీన్ ఒకటి ఉంది. సింగిల్ టేక్ లో ఆ సీన్ కంప్లీట్ చేశా. పవన్ కళ్యాణ్ గారు మీ నటన చాలా నేచురల్ గా ఉంటుంది అని ప్రశంసించారు. అక్కడ కూడా జోకులు వేశా. మీరు కూడా నాలాగే నటిస్తారు సర్ అని అన్నా. అవునా థాంక్స్ అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X