twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ కాళ్లు పట్టుకుంటా, మా బాధ అర్థం చేసుకోండి: నటి హేమ ఎమోషనల్

    |

    మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) జనరల్ బాడీ మీటింగ్ అనంతరం 'మా' ఉపాధ్యక్షురాలు హేమ మీడియాతో మాట్లాడారు. ఈసారి రెండు ప్యానెల్స్‌కు చెందిన వారు కమిటీలో ఉండటంతో పరిస్థితి ఎలా ఉంటుందో? అని టెన్షన్ పడ్డాను. కానీ 'మా' ఐక్యమత్యం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. మెంబర్స్ అంతా మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు, బ్లెస్ చేశారు. నరేష్ గారి ఆధ్వర్యంలో అందరం ముందుకు వెళుతున్నాం... 'మా'ను ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.

    ఎప్పటి నుంచో కలగా ఉన్న 'మా' అసోసియేషన్‌కు ఈసారైనా బిల్డింగ్ కట్టకుని మన పేర్లు చిరస్థాయిగా ఆ శిలాపలకంలో చేరాలని కోరుకుంటున్నాను. దాని కోసం ల్యాండ్ కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ఇద్దరు సీఎంలను కలిసి వినతి పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    ముందు ఇంట్లో ఆడవారికి అన్నం పెట్టండి

    ముందు ఇంట్లో ఆడవారికి అన్నం పెట్టండి

    ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు, రైటర్లు, ప్రొడ్యూసర్లకు నేను చెప్పేది ఒకటే. ముందు ఇంట్లో ఆడవారికి అన్నం పెట్టండి. తర్వాత బయటి వారిని తీసుకుని రండి. ఇక్కడి వారు అకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని హేమ తెలిపారు.

    మీ కాళ్లకు దండం పెడతాను

    మీ కాళ్లకు దండం పెడతాను

    ఆడవారు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు మీటింగులో ఎంతో మంది అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు చెబుతూ ఏడ్చారు. దయచేసి వీరిపై కాస్త దృష్టి పెట్టండి. నేను మీ అందరి కాళ్లకు దండం పెట్టమన్నా పెడతాను. ఇంత మొండిదాన్ని నా కళ్లవెంట నీళ్లు వస్తున్నాయంటే వారు వేషాల కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోండి... అంటూ హేమ వ్యాఖ్యానించారు.

    మగాళ్లకు కూడా కష్టాలు ఉన్నాయి

    మగాళ్లకు కూడా కష్టాలు ఉన్నాయి

    800 మంది మెంబర్లలో వంద నుంచి నూటయాభై మంది మాత్రమే ఆడవారు ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఆర్టిస్టు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మగాళ్లకు కష్టాలు లేవని చెప్పడం లేదు... కానీ చాలా తక్కువ మంది ఉన్న ఆడవారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది నా కోరిక ... అని హేమ తెలిపారు.

    తప్పుడు దారులు పట్టే పరిస్థితి తేవొద్దు

    తప్పుడు దారులు పట్టే పరిస్థితి తేవొద్దు

    ఇండస్ట్రీకి చెందిన మన అక్కా చెళ్లెళ్లను వేరే చోట చూడొద్దు. మీడియాలో వేరే టైటిల్స్‌లో మమ్మల్ని వేసే పరిస్థితి తేవొద్దు. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు మమ్మల్ని మీ సోదరీమణులుగా, కూతుళ్లుగా భావించి అవకాశాలు ఇవ్వాలని...హేమ కోరారు.

    English summary
    Actress Hema speech about Women artists struggles in the film industry. She Requested to Producers and Directors to first give opportunities to Telugu people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X