పబ్లో లేను..బద్నాం చేస్తున్నారు.. రిపోర్టర్ మీద ఫైర్ అయిన హేమ.. చెప్పుతో కొట్టాలంటూ!

హైదరాబాదులో సంచలనంగా మారిన అర్ధరాత్రి రేవ్ పార్టీ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది నటీనటులు, నటులకు అత్యంత సన్నిహితులైన వారు ఈ వ్యవహారంలో పట్టుబడ్డారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటకు రాగా ఆయనతో పాటు మరి కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి ఇదే క్రమంలో నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలో హేమ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఆమె ఒక మీడియా రిపోర్టర్ మీద ఆరోపణలు చేశారు. అలాగే కేసు కూడా పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

సంబంధం లేదని

సంబంధం లేదని


హైదరాబాదులో పొద్దుపోయిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు అతి దగ్గరలో ఉన్న ఒక పబ్ మీద దాడి చేశారు ఆ సమయంలో 150 మంది యువతీ యువకులు కనిపించడంతో వారందరినీ అరెస్టు చేసి కౌన్సిలింగ్ కోసం తరలించారు. అయితే అదే సమయంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ఒక హీరో, మరో హీరోయిన్ కూడా ఉందని ప్రచారం జరిగింది అయితే ఎవరికి వారు తమకు సంబంధం లేదని మీడియాకు సమాచారం ఇచ్చారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి

పోలీస్ స్టేషన్ కు వెళ్లి

అయితే ఈ వ్యవహారంలో హేమ కూడా ఉన్నారని కొన్ని న్యూస్ ఛానల్స్ లో స్క్రోలింగ్ వచ్చింది. ఈ క్రమంలో సదరు న్యూస్ ఛానల్ రిపోర్టర్ కి హేమ ఫోన్ చేయగా ఆమెతో సదరు రిపోర్టర్ దురుసుగా మాట్లాడారని ఆరోపిస్తోంది. అంతేకాక తను దురుసుగా మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా తన దగ్గర ఉందని ఆమె చెబుతున్నారు. నా పేరు ఎందుకు వాడుతున్నారు అని రిపోర్టర్ ని అడిగితే తన మీద దబాయిస్తూ మాట్లాడారని చెబుతూ ఆమె బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రిపోర్టర్ ను మాత్రమే

రిపోర్టర్ ను మాత్రమే


ఈ క్రమంలోనే తన పేరు వాడిన రిపోర్టర్ ని గాడు అంటూ సంబోధించడం తో అక్కడ ఉన్న మిగతా మీడియా ప్రతినిధులు ఆమెకు అడ్డుతగిలారు. అలా రిపోర్టర్లను సంబోధించడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. అయితే హేమ అక్కడ ఉన్న మిగతా మీడియా ప్రతినిధులతో కూడా వాగ్వివాదానికి దిగింది. కానీ తర్వాత తాను అందర్నీ అనడం లేదని తన పేరు ప్రస్తావించిన రిపోర్టర్ ను మాత్రమే అంటున్నాను అని చెప్పుకొచ్చారు.

సరికాదని

సరికాదని

అసలు నేను పబ్లో లేకపోయినా నా పేరు ఎందుకు బయటకు తీసుకు వచ్చారు? అంటూ ఆమె నిలదీశారు తన కుటుంబ సభ్యులు, తమ బంధువులు ఎక్కడెక్కడినుంచో ఫోన్ చేసి తన యోగక్షేమాలు అడుగుతున్నారని ఒకరకంగా వారంతా తనవల్ల బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒక పెద్ద కేసులో తన పేరుని తెచ్చి చేసి బద్నాం చేశారని పేర్కొన్న ఆమె ఒక మహిళపై ఈ విధమైన ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
చెప్పుతో కొట్టాలని

చెప్పుతో కొట్టాలని


ఇక్కడ అందరి పిల్లలు ఈ వ్యవహారంలో ఇరుక్కుంటున్నారు అని కేవలం సినిమా వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు అని అన్నారు డ్రగ్స్ ఎవరు తీసుకున్న తప్పేనని పేర్కొన్న ఆమె అలాంటి వారిని చెప్పుతో కొట్టాలని చెప్పుకొచ్చారు.మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X