»   » పెళ్లి, ఆపై గర్భం...ఇళయరాజా మోసంపై నటి హేమ (ఫోటోస్)

పెళ్లి, ఆపై గర్భం...ఇళయరాజా మోసంపై నటి హేమ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ నటుడు ఇళయారాజా తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేసాడని, అతని వల్ల తాను గర్భవతి అయ్యానని, అబార్షన్ కూడా చేయించాడని తెలుగు నటి, నిర్మాత హేమలత ఆరోపించారు. ఈ విషయమై తాను పోలీసులతో పాటు ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసాని ఎవరూ పట్టించుకోవడం లేదని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాకు చెప్పుకోవడానికి ఆమె శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంగా ఆమె తెలిపారు. సినిమాల్లో నటించాలనే కోరికతో ఈ రంగంలోకి వచ్చానని, తెలుగులో అవకాశాలు లేక 2011లో చెన్నై వెళ్లినట్లు హేమ తెలిపారు.

ఈ క్రమంలోనే తనకు 2014లో తమిళ నటుడు ఇళయారాజాతో పరిచయం ఏర్పడిందని, ఇద్దరం రెండు సంవత్సరాలు కలిసి సహజీవనం చేసామని, 2015లో ఇంట్లోనే తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు. ఈ విషయం ఇళయరాజా కుటుంబ సభ్యులకు, తన కుటుంబ సభ్యులకు తెలుసని హేమ తెలిపారు.

ఇళయారాజా సోదరిడి పెళ్లి తర్వాత ఇద్దరం అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుందామని చెప్పి తనను లోబరుచుకున్నాడని, గర్భం వస్తే అబార్షన్ చేయించాడని ఆమె తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 3న తాము కలిసి ఉంటున్న ఇంటి నుండి వెళ్లిన ఇళయారాజా తిరిగి రాలేదని, అతనికి వేరే యువతితో పెళ్లి సెటిలైన విషయం తెలిసి తమిళనాడులోని మదురవాయిల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

ఇప్పటి వరకు తాను పలు వ్యాపార ప్రకటనలతో పాటు రెండు సినిమాల్లో నటించానని... అనంతరం సినీ నిర్మాణ సంస్థను స్థాపించి రెండు చిత్రాలు తీసినట్లు తెలిపారు. తనకు తగిన న్యాయం జరిగేలా చూడలని, ఇళయరాజాకు మరో యువతితో పెళ్లి జరుగకుండా అడ్డుకోవాలని ఆమె కోరారు.

హేమలత

హేమలత


తమిళ నటుడు ఇళయారాజా తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేసాడని, అతని వల్ల తాను గర్భవతి అయ్యానని, అబార్షన్ కూడా చేయించాడని తెలుగు నటి, నిర్మాత హేమలత ఆరోపించారు.

పట్టించుకోవడం లేదు

పట్టించుకోవడం లేదు


ఈ విషయమై తాను పోలీసులతో పాటు ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసాని ఎవరూ పట్టించుకోవడం లేదని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

పెళ్లయింది

పెళ్లయింది


ఇద్దరం రెండు సంవత్సరాలు కలిసి సహజీవనం చేసామని, 2015లో ఇంట్లోనే తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు. ఈ విషయం ఇళయరాజా కుటుంబ సభ్యులకు, తన కుటుంబ సభ్యులకు తెలుసని హేమ తెలిపారు.

గర్భం, అబార్షన్

గర్భం, అబార్షన్


సోదరిడి పెళ్లి తర్వాత ఇద్దరం అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుందామని చెప్పి తనను లోబరుచుకున్నాడని, గర్భం వస్తే అబార్షన్ చేయించాడని ఆమె తెలిపారు.

English summary
Actress Hemalatha Files Complaint Against her Husband Actor/Producer Ilayaraja.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu