Ileana Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా.. పుట్టబోయే బిడ్డకు తండ్రి అతడేనా!
ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదగడం ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, కొందరు మాత్రమే తమదైన రీతిలో సత్తా చాటి హవాను చూపించారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా డిక్రూజ్ ఒకరు.
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తన రేంజ్‌ను చూపించిన ఈ చిన్నది.. ఇప్పుడు వేరే ఇండస్ట్రీల్లో సత్తా చాటుతోంది. ఇలా ఇప్పటికీ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించి షాకిచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసమే!

టీనేజ్‌లోనే స్టార్‌డమ్‌తో: చిన్న వయసులోనే ఇలియానా 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఫస్ట్ మూవీలోనే యాక్టింగ్, గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ నటించింది. ఇలా ఎన్నో హిట్ల కొట్టేసి స్టార్‌డమ్‌ను అందుకుంది.
బ్రేకప్‌తో కెరీర్ నాశనమే: టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా ప్రభావాన్ని చూపించిన ఇలియానా.. కొంత కాలం పాటు హిట్లు రాకపోవడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆరంభంలో చక్కగానే రాణించింది. ఆ సమయంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో లవ్ ట్రాక్ నడిపింది. కొన్నేళ్లకు అతడికి బ్రేకప్ చెప్పేసి డిప్రెషన్‌లోకి వెళ్లింది. దీంతో కెరీర్ నాశనమైంది.

ఇప్పుడిప్పుడే చక్కదిద్ది: ఆండ్రూతో బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు కెరీర్ పరంగా, పర్సనల్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇలియానా.. ఇప్పుడిప్పుడే కెరీర్‌ను మళ్లీ చక్కదిద్దుకుంటోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది. ఇలా ఇటీవలే Sab Gazab అనే మ్యూజిక్ వీడియో చేసింది. అలాగే, Unfair & Lovely అనే మూవీనీ చేసింది.
ఆ హీరోయిన్ తమ్ముడితో: సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఇలియానా పర్సనల్ విషయాలపైనా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉంది. చాలా కాలంగా వీళ్లిద్దరూ తమ బంధాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసిందే.

తల్లి కాబోతున్న బ్యూటీ: ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలియానా డిక్రూజ్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను సైతం షేర్ చేసింది. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.
ఆ రెండు ఫొటోలతోనే: తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇలియానా ఓ టీషర్ట్ ఫొటోను వదిలింది. దాని మీద 'అండ్ సో ది అడ్వెంచర్ బిగిన్స్' (సాహసయాత్ర ప్రారంభమవుతుంది) అని రాసి ఉంది. అలాగే, మెడలో 'మమ్మ' (అమ్మ) అంటూ ఉన్న చైన్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, ఈ పోస్టుకు 'త్వరలోనే వస్తుంది. నా చిన్నారిని కలిసేందుకు వేచి చూస్తున్నా' అని రాసింది.

బిడ్డకు తండ్రి అతడే!: తన తాజా పోస్టు ద్వారా తల్లి కాబోతున్నానని ఇలియానా స్పష్టం చేసింది. దీంతో ఆమె బిడ్డకు తండ్రి ఎవరు అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేలే.. ఇలియానాకు పెట్టే బిడ్డకు తండ్రి అని తెలిసింది. అంతేకాదు, త్వరలోనే రెండు ఫ్యామిలీలు కలిసి ప్రకటిస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications











