Jamuna Death: జమునకు మూడేళ్లు శిక్ష.. బాయ్ కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్? ఇవే కారణాలు!

తెలుగు ప్రేక్షకుల్లో గడుసు, అమాయకపు పాత్రలతో గుర్తింపు పొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయోధిక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె జనవరి 27వ తేదీన అంటే శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సుమారు ఏడు దశాబ్దాలకుపైగా సినీ రంగంలో వివిధ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించికున్న జమున మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు హీరోయిన్ గా పర్ఫెక్ట్ జోడి అయిన జమునను వాళ్లు బాయ్ కాట్ చేశారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అలా ఎందుకు జరిగిందనే వివరాల్లోకి వెళితే..

 1936లో కర్ణాటకలో..

1936లో కర్ణాటకలో..

సత్యభామగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున 1936లో కర్ణాటకలోని హంపీలో నిప్పాని శ్రీనివాస రావు, కౌసల్యా దేవీ దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు జానా భాయి. పసుపు, పొగాకు వ్యాపారాన్ని చేసే జమున తండ్రి దుగ్గిరాలకు మారారు. దాంతో జమున బాల్యం దుగ్గిరాలలోనే గడిచింది. సినిమా అవకాశాల కోసం చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డింది జమున కుటుంబం. ఆ తర్వాత సినీ పరిశ్రమ తరలిరావడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు అలనాటి హీరోయిన్ జమున.

భూ కైలాస్ సినిమా సమయంలో..

భూ కైలాస్ సినిమా సమయంలో..

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ వీరిద్దరిలో ఒక్కరితో జమునకు గొడవ అని అప్పట్లో వైరల్ అయిన విషయం. తనతో గొడవ పడిన హీరో మరొక హీరోను తోడు చేసుకుని తనపై మూడేళ్లపాటు బ్యాన్ విధించారని జమన ఒకానొక సందర్భంలో తెలిపినట్లు పలు వార్తలు కూడా రాశాయి. భూ కైలాస్ సినిమా షూటింగ్ సమయంలో జమున ఆలస్యంగా రావడమే అందుకు కారణమని సినీ ఇండస్ట్రీలో వినిపించే టాక్.

 దూరం పెట్టి అగ్ర హీరోలు..

దూరం పెట్టి అగ్ర హీరోలు..

భూ కైలాస్ సినిమా చిత్రీకరణకు జమున సుమారు 3 గంటలపాటు ఆలస్యంగా రావడమే కాకుండా అప్పటి వరకు ఎండలో ఎదురుచూస్తున్న తనకు క్షమాపణ కూడా చెప్పకపోవడంపై సీనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఇన్సైడ్ టాక్. ఇక ఎన్టీఆర్ చెప్పడంతో అక్కినేని నాగేశ్వర రావు కూడా జమునను దూరం పెట్టారట. ఈ విషయాన్ని తన ఆత్మకథలో అక్కినేని నాగేశ్వర రావు వివరించారని సమాచారం.

 ఆ కారణాలు సరైనవి కావు..

ఆ కారణాలు సరైనవి కావు..

ఈ క్రమంలోనే జమునతో సినిమాలు చేసేది లేదని ఎన్టీఆర్, ఏఎన్నార్ బహిరంగంగా కూడా చెప్పారట. ఆమెను ఎందుకు బాయ్ కాట్ చేశారని అడిగినదానికి.. జమున షూటింగ్ లకు లేటుగా వస్తారని, పొగరుబోతు అని, తమ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారని కారణాలు చెప్పారట. అనంతరం వాళ్ల కారణాలు నిజమైతే.. తాను అన్ని సినిమాల్లో నటించే అవకాశం ఎందుకు వచ్చిందని జమున ఎదురు ప్రశ్నించారు. హీరోలు చెప్పిన కారణాలు సమంజసం కాదని, అసలు కారణాలు ఏంటన్నది తనకు తెలుసు అని, అయితే ఎవ్వరికీ చెప్పే ఉద్దేశం లేదని చెప్పారట సత్యభామ జమున.

 లేడీ ఒరియెంటెడ్ కథలతో ఫీమేల్ స్టార్ గా..

లేడీ ఒరియెంటెడ్ కథలతో ఫీమేల్ స్టార్ గా..

ఇక మూడేళ్ల పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్, జమున కలిసి సినిమాల్లో నటించలేదు. ఇద్దరు స్టార్ హీరోలు బ్యాన్ విధించడంతో హరినాథ్, జగ్గయ్య తదితరుల సరసన జమున నటించాల్సి వచ్చిందట. అప్పుడే ఆమెకు హీరోయిన్ ఒరియెంటెడ్ కథలు ఎక్కువగా వచ్చాయి. ఆ చిత్రాలు సక్సెస్ కావడంతో.. జమునపై ఫీమేల్ స్టార్ ముద్ర పడిందని సమాచారం. ఆ గొడవ కారణంగా ఇంకా సరైన సినిమాలు జమునకు రావట్లేదని.. చక్రపాణి, కేవీ రెడ్డి రాజీ కుదిర్చారని చిత్రసీమలో వినిపించే టాక్.

ఇష్టం లేనప్పటికీ..

ఇష్టం లేనప్పటికీ..

గుండమ్మ కథను చక్రపాణి రాసి మూడేళ్లు అయందట. అందులో ఎన్టీఆర్-సావిత్రి ఒక జంటగా.. అక్కినేని నాగేశ్వర రావు-జమున మరో జంటగా అనుకున్నారట. ఈ గొడవ విషయం తెలిసి హీరోలను, జమునను పిలిచి రాజీ కుదిర్చారట. ముందుగా జమునను క్షమాపణ పత్రం రాసి ఇవ్వమంటే.. ఆమె నిరాకరించినట్లు ఒక సందర్భంలో తెలిపారు. ఇక గుండమ్మ కథ కోసం ప్లాన్ చేస్తే.. ముందుగా గులేబకావళి మొదలైందట. అందులో ఎన్టీఆర్-జమున జంటగా నటించారు. తర్వాత గుండమ్మ కథలోనూ నటించారు. ఈ సినిమాలో జమునను తీసుకోవడం ఎన్టీఆర్ కు ఇష్టం లేనప్పటికీ ఏఎన్నార్ కోసం ఒప్పుకున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X