twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ ఛాంబర్ లో నటి జమున పార్థివ దేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే నటిమణులలో జమున గారు ఒకరు. అలాంటి మహా నటి ఈరోజు కన్నుమూశారు. ఇక ఆమె హఠాత్తుగా మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనారోగ్య కారణాల వలన గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. జమున నేడు ఉదయం తుది శ్వాసను విడిచారు. 1936 ఆగస్టు 30వ తేదీన జన్మించిన జమున గారి వయసు 86 సంవత్సరాలు.

    1953లో ఆమె పుట్టినిల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జామున మరణంతో సినీ అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇక జమునను కడసారి చూడాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ కు జమున గారి పార్థివ దేహాన్ని తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు గంటలకు ఇంటి దగ్గర నుంచి ఫిలిం ఛాంబర్ కు జమున పార్థివదేహాన్ని తీసుకురానున్నారు.

    Actress jamuna last rites and funeral details latest updates

    ఇక సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఫిలిం ఛాంబర్ లోనే జమున గారి భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అక్కడికి సినీ ప్రముఖులు అభిమానులు వచ్చి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు జమున గారికి ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    జామున గారు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో గుర్తింపు అందుకున్నారు. అందులో మిస్సమ్మ, చిరంజీవులు, సంతోషం, దొంగ రాముడు, బంగారు పాప, భూకైలాస్ గుండమ్మ కథ ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె మంచి పాత్రలతో మెప్పించారు. ఇక 2008లో ఆమె ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూడా జామున విజయాన్ని అందుకుని కాంగ్రెస్ ఎంపీగా కొన్నాళ్లు కొనసాగారు.

    Read more about: jamuna tollywood
    English summary
    Actress jamuna last rites and funeral details latest updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X