జాన్వీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం.. క్వారంటైన్‌లోకి..
ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన ఇంట్లో పనిచేసే చరణ్ సాహు అనే పనిమనిషికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అప్రమత్తమైన బోని బృహన్ ముంబై మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బోనికపూర్ క్వారంటైన్‌లోకి వెళిపోయారు. బోని కపూర్ ఇంట్లో కోవిడ్ పాజిటివ్ వ్యవహారం ఆందోళనకరంగా మారింది. అయితే జాహ్నవి, కుషీ కపూర్ విషయంలో ఏం జరిగిందంటే..
Recommended Video

బోనికపూర్ పనిమనిషికి కరోనా
ముంబైలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో బోని కపూర్ కుటుంబం చాలా జాగ్రత్తలు తీసుకొన్నది. బోని కపూర్ తన కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లను అంధేరిలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో పెట్టి వారితోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి పని మనిషి చరణ్ సాహు అస్వస్థతకు గురయ్యాడు. గత శనివారం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుటుండటం, కరోనా లక్షణాలు కనిపించడంతో చరణ్‌కు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

మా పనిమనిషికి కోవిడ్ 19 లక్షణాలు
పని మనిషి చరణ్‌కు సంబంధించి రోగ నిర్ధారణ పరీక్షల్లో సోమవారం వెల్లడైన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. దాంతో వెంటనే అతడిని ఐసోలేషన్ వార్డుకు పంపించాం. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతున్నది. ఈ విషయాన్ని రిసిడెన్షియల్ కాంప్లెకస్ సొసైటికి, బీఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చాం అని బోని కపూర్ తెలిపారు.

బీఎంసీ అధికారులకు సమాచారం
తమ పనిమనిషికి కరోనా పాజిటివ్ అనే విషయాన్ని బోనికపూర్ ధృవీకరించారు. అతడికి పాజిటివ్ రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఇప్పటికి మా ఇంట్లో ఎవరికీ కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. బీఎంసీ అధికారుల స్పందన చాలా బాగుంది. వెంటనే వారు స్పందించి తగిన చర్యలు తీసుకోవడం హ్యాపీగా ఉంది అని తెలిపారు.

మేమంతా క్షేమమే...
ప్రస్తుతం నేను, జాన్వీ, ఖుషీ కపూర్ అందరం క్షేమంగా ఉన్నాం. చరణ్‌ను ఐసోలేషన్‌కు తరలించిన తర్వాత మేమంతా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మేము ఇళ్లు విడిచి వెళ్లలేదు. మా ఇంట్లో వ్యక్తికి కరోనా అని తెలియగానే మహారాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అధికారులు త్వరగా స్పందించారు. వైద్య బృందం వెంటనే వచ్చి మమల్ని, మా కుటుంబానికి పరీక్షలు జరిపింది. మాకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని మెడికల్ సిబ్బంది తెలిపారని బోని కపూర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











