twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా రూ 4 కోట్లు మోసపోయా.. నా మీద నాకే అసహ్యం.. నటి జయలలిత ఎమోషనల్

    |

    సినీ ఇండస్ట్రీలో జరిగే మోసాల గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎంతో వెలుగు వెలుగుతూ ఉన్నా కూడా మోసపోయి నడి రోడ్డు మీదకు వచ్చిన తారలెంతో మంది ఉన్నారు. తాజాగా నటి జయలలిత కూడా తాను మోస పోయిన విధానాన్ని, తన పరిస్థితి గురించి చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా స్టార్డం అనుభవించిన జయలలిత ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది.

    వెండితెరపై అలా..

    వెండితెరపై అలా..

    జయలలిత అనగానే చాలా మందికి వ్యాంప్ క్యారెక్టర్స్ గుర్తుకు వస్తుంటాయి. హాట్ హాట్ మసాలా పాటల్లో డ్యాన్స్ చేసిన జయలలిత ఒకెత్తు అయితే.. ఎన్నో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడం మరో ఎత్తు. ఎలాంటి పాత్రలు పోషించినా కూడా వంద శాతం న్యాయం చేస్తుంది.

    బుల్లితెరపై స్టార్..

    బుల్లితెరపై స్టార్..

    వెండితెరపై అవకాశాలు తగ్గిన తరువాత జయలలిత బుల్లితెరపై ఫోకస్ పెట్టేసింది. బుల్లితెరపై ఆమె వేసే పాత్రల్లో హుందాతనం కనిపిస్తుంటుంది. ఊరి పెద్దగా, కుటుంబాన్ని నడిపించే పెద్ద వ్యక్తిగా ఆమె వేసిన ఎన్నో పాత్రలు సీరియల్స్‌లో హిట్ అయ్యాయి. అలా బుల్లితెరపై క్షణం తీరిక లేకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి జయలలిత ఓ సీరియల్ నిర్మాత చేతిలో మోసపోయానని చెప్పుకొచ్చింది.

    అలా మోసం..

    అలా మోసం..

    బుల్లితెరపై జయలలిత ఫుల్ బిజీగా ఉంటూ బాగా సంపాదిస్తున్న నాటి రోజులను గుర్తు చేసుకుంది. జీఎస్టీ చెల్లించాలి.. సీరియల్స్ తీయడం కష్టమవుతోందని అన్నారు.. అప్పుడు నా డబ్బులు వాడుకోండి.. షేర్ లాంటివి ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు అని చెప్పానంటూ నాటి విషయాలను జయలలిత చెప్పుకొచ్చింది.

    నా మీద నాకే..

    నా మీద నాకే..

    అలా తీసుకుంటూ ఇస్తూ.. 2018 డిసెంబర్ నాటికి నా దగ్గర నాలుగు కోట్లు తీసుకున్నారు.. ఆ తరువాత చేతులెత్తేసి వెళ్లిపోయాడు.. ఇప్పుడు నేను క్యాబ్‌లో తిరుగుతున్నాను. కారు లేదు.. ఒకప్పుడు ఎన్నో కార్లు వాడానో.. ఇంత నమ్మి ఎలా మోసపోయాను.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది..అంటూ జయలలిత కన్నీరు పెట్టేసుకుంది.

    English summary
    Actress Jayalalitha Is cheated By Serial Producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X