నటి జయలలిత ఎమోషనల్ స్పీచ్.. కొరటాల మాట్లాడడం చూసి ఏడ్చేశా, నా కడుపున పుట్టాలి!

భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అద్భుత నటన అభిమానులని ఆకట్టుకుంటోంది. మహేష్ ఈ చిత్రంలో సీఎం పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. చిత్ర యూనిట్ ఇప్పటికి అగ్రెసివ్ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. శనివారం ఈ చిత్ర బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, ఇతర విభాగం ఈ ఈవెంట్ లో పాల్గొని వారి సంతోషాన్ని తెలియజేసారు. నటి జయలలిత ఈ చిత్రం స్పీకర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. భరత్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ లో ఆమె ఎమోషనల్ గా ప్రసంగించారు.

రాజకుమారుడు తరువాత

రాజకుమారుడు తరువాత

అందమైన సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను రాజకుమారుడు చిత్రంలో నటించానని జయలలిత అన్నారు. రాజకుమారుడు తరువాత ఆయనతో కలసి నటించడం ఇదే తొలిసారి అని జయలలిత తెలిపారు.

చిన్న భాగం అయ్యాను

చిన్న భాగం అయ్యాను

చాలా ఏళ్ల తరువాత తాను విజయవంతమైన సినిమాలో చిన్న భాగం అయ్యానని, ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉందని జయలలిత అన్నారు.

 సంతోషంతో ఏడ్చేశా

సంతోషంతో ఏడ్చేశా

కొరటాల శివ గారు ఓ ఇంటర్వ్యూలో తనగురించి మాట్లాడడంచూసి తాను సంతోషంతో ఏడ్చేశానని అన్నారు. వ్యాంప్ ఇమేజ్ ఉన్న జయలలితని స్పీకర్ పాత్రకు ఎంచుకునే సాహసం ఎలా చేశారనే ప్రశ్న కొరటాలకు ఎదురైనప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు నచ్చిందని జయలలిత అన్నారు. ఆమెలో తాను అమ్మని చూశానని కొరటాల చెప్పినట్లు జయలలిత తెలిపింది.

కొరటాల నా కడుపున పుట్టాలి

కొరటాల నా కడుపున పుట్టాలి

ఆడియన్స్ కోణంలో తాను ఆలోచించనని, జయలలితతో హుందాతనం గమనించానని కొరటాల ఇంటర్వ్యూలో తెలిపినట్లు ఆమె అన్నారు. కొరటాల శివ తన కడుపున పుట్టాలని కోరుకుంటున్నట్లు జయలలిత ఎమోషనల్ గా ప్రసంగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X