twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Actress Jayanthi Passes away: విషాదంలో దక్షిణాది సినీ పరిశ్రమ.. ఆ స్టార్ హీరోతో 30 సార్లు!

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న నటి జయంతి ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన నివాసంలో సోమవారం (జూలై 26) ఉదయం కన్నుమూశారు. దక్షిణాదిలో ఆమెను అభినయ శారదే‌గా పేర్కొంటారు. తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో 1960 నుంచి 80 దశకం వరకు అంటే ఆరు దశాబ్దాలపాటు హీరోయిన్‌గా రాణించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయ నటిగా ఎన్నో అవార్డులు అందుకొన్నారు. ఆమె మృతి వార్తతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది.

     బళ్లారిలో జననం

    బళ్లారిలో జననం

    జయంతి 1945లో బళ్లారిలో బాలసుబ్రమణ్యం, సంతానలక్ష్మి దంపతులకు జన్మించారు. జయంతి తండ్రి ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే వారు. జయంతికి ఇద్దరు సోదరులు ఉన్నారు. తల్లిదండ్రులు విడిపోవడంతో వారి కుటుంబం మద్రాసుకు వెళ్లిపోయింది. తల్లితోపాటు మద్రాస్‌లో పెరిగారు. అక్కడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొన్నారు. ఆ డ్యాన్స్ స్కూల్‌లోనే ప్రముఖ నటి మనోరమ ఆమెకు స్నేహితురాలుగా మారింది.

     వైవాహిక జీవితం అలా

    వైవాహిక జీవితం అలా

    నటిగా అగ్రస్థానంలో కొనసాగుతుండగానే.. సినీ ప్రముఖుడు పేకేటి శివరాంతో వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. అనంతరం మరో ప్రముఖుడితో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడిపోయారు. జయంతికి ఒక కుమారుడు ఉన్నారు.

     ఎన్టీఆర్ ఒడిలో.. ఆ తర్వాత హీరోయిన్‌గా

    ఎన్టీఆర్ ఒడిలో.. ఆ తర్వాత హీరోయిన్‌గా

    ఒక సమయంలో ఎన్టీఆర్‌ను చూడటానికి బాల్యంలో షూటింగ్ వెళ్లారు. చిన్నారి జయంతిని చూసి తన ఒడిలో ఎన్టీఆర్ కూర్చోబెట్టుకొన్నారు. ఆ సమయంలో హీరోయిన్ అవుతావా అంటూ చిన్నారిని అడిగితే అవుతాను అని చెప్పారట.. ఆ తర్వాత యుక్త వయసులో ఎన్టీఆర్‌తో జగదేక వీరుడు కథ, కుల గౌరవం చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా కొండవీటి సింహం, జస్టిస్ చౌదరీ చిత్రాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకుల్లో ఎప్పటికీ మరిచిపోలేనటు వంటి నటిగా ముద్ర వేసుకొన్నారు.

    కన్నడలో స్టార్ హీరోయిన్‌గా

    కన్నడలో స్టార్ హీరోయిన్‌గా

    తొలుత కన్నడ చిత్ర రంగంలో విశేషమైన ప్రేక్షకదారణను పొందారు. అనతికాలంలో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారారు. జెను గుడ్ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి ప్రవేశించారు. చండవాలియ తోట చిత్రంలో స్వర్గీయ రాజ్‌కుమర్‌తో నటించి మరింత పాపులారిటీ సాధించారు. ఆ చిత్రానికి కన్నడలో ప్రసిడెన్స్ మెడల్ కూడా అందుకొన్నారు.

    దక్షిణాదిలో అగ్ర నటులతో

    దక్షిణాదిలో అగ్ర నటులతో

    దక్షిణాదిలోని ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్‌కుమార్, మోహన్ బాబు లాంటి అగ్రనటులతో నటించారు. రాజ్ కుమార్‌తో కలిసి హీరోయిన్‌గా 30 చిత్రాల్లో జయంతి నటించారు. ఎన్టీఆర్‌తో బడిపంతులు, కృష్ణతో దేవదాసు, మోహన్ బాబుతో పెదరాయుడు, చిరంజీవితో రాజా విక్రమార్క, నాగార్జునతో ఘరానా బుల్లోడు లాంటి పలు చిత్రాల్లో నటించారు. చివరగా 2011లో తెలుగులో నమితా ఐ లవ్ యూ చిత్రంలో నటించారు.

    Recommended Video

    Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
     500కుపైగా చిత్రాల్లో పలు పాత్రలు

    500కుపైగా చిత్రాల్లో పలు పాత్రలు

    కన్నడలో పాపులారిటీ సాధించిన తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో జయంతి ఏడుసార్లు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నాలుగుసార్లు ఉత్తమ అవార్డులు, రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొన్నారు. ఆ సమయంలో ఆమెను బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడేవారు.

    Read more about: jayanthi జయంతి
    English summary
    Actress Jayanthi no more, die in Bangalore at the age 76
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X