twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీకారం దిశగా జయప్రద.. బీజేపీలో చేరిన సినీ నటి

    |

    దేశవ్యాప్తంగా రాజకీయాలు, ఎన్నికల వాతావరణం వేడెక్కింది. భగ్గుమంటూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వేసవి కాలాన్ని చిన్నబోయేలా చేస్తున్నాయి. ఇక రాజకీయ నేతల పార్టీల ఫిరాయింపులు, జంపింగ్ జపాంగ్‌ల వ్యవహారం ఆటలో అరటిపండుగా మారాయి. తాజాగా సినీ నటి జయప్రద సమాజ్ వాదీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరడం దేశవ్యాప్తంగా ఆకర్షించింది.

    గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయప్రద గెలిచారు. గత ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి జయప్రద సమాజ్ వాదీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో జయప్రదకు రాంపూర్ నుంచి సీట్ కేటాయించకపోవడంతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

    Actress JayaPrada Joined in BJP

    2019లో అంటే తాజాగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జయప్రదను రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు బీజీపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాంపూర్‌లో సమాజ్ వాదీ అభ్యర్థి అజయ్ ఖాన్‌పై జయప్రద పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. కొద్దికాలంగా అజయ్ ఖాన్, జయప్రద మధ్య పచ్చ గడ్డి వేస్తు భగ్గుమనే పరిస్థితి ఉంది.

    బీజేపీలో చేరిన జయప్రద మీడియాలో మాట్లాడుతూ... నేను బీజేపీలో చేరాను. నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితురాలినై బీజేపీలో చేరాను అని అన్నారు. తన ప్రత్యర్థి అజం ఖాన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకొంటుందా అనే చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Film actress JayaPrada Joined in BJP. Jaya Prada says that she was joining the BJP as she was impressed with the work of Prime Minister narendramodi. JayaPrada likely to contest against Azam Khan in Rampur
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X