»   » పవన్ కళ్యాణ్ పార్టీపై సీనియర్ నటి జయసుధ కామెంట్!

పవన్ కళ్యాణ్ పార్టీపై సీనియర్ నటి జయసుధ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actress Jayasudha about Pawan Kalyan Political entry
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించబోతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రముఖ సినీయర్ నటి, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ పవన్ కళ్యాణ్ పార్టీపై తనదైన రీతిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటంపై ఆమె పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు.

'మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా వచ్చి సమాజానికి సేవ చేయవచ్చు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక మంచి లీడర్ అవుతారని అనుకుంటున్నాను' అని జయసుధ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగులో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించడంతో పాటు, పార్టీ విదివిధానాలు, తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ గురించి ప్రజలు, అభిమానులు, మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగం అన్ని టీవీ ఛానల్స్‌లో లైవ్ ప్రసారం కానుంది. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి అభిమానులు, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్ ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసారు. మరో వైపు పవన్ కళ్యాన్, పార్టీ 'జన సేన' లోగో, సాంగ్ కూడా విడుదల చేసారు.

English summary

 "Ours is a Democratic Country and anyone who wishes to serve the society have to be welcomed. I personally feel, Pawan should be in politics" Actress Jayasudha opined.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu