ఆ సినిమా కారణంగా.. చెక్ బౌన్స్ కేసులో కోర్టులో హాజరయిన సినీనటి జీవిత రాజశేఖర్

ప్రముఖ నటి నిర్మాత దర్శకురాలు జీవిత రాజశేఖర్ మరొక కేసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదివరకే రాజశేఖర్, జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా పలు కేసుల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులలో విరిపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆస్తులు తాకట్టుపెట్టి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా వారు తాకట్టు పెట్టిన ఆస్తులను కూడా అమ్ముకున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో ఎప్పటికప్పుడు జీవిత రాజశేఖర్ మీడియాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక రీసెంట్గా మరొక చెక్ బౌన్స్ కేసులో చిత్తూరు జిల్లా నగరి కోటలో హాజరు కావాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 2017 లో వచ్చిన గరుడవేగ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించగా సినిమా కొంత ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టింది.

Actress Jeevitha Rajasekhar appeared in the court in check bounce case

అయితే ఈ సినిమా కోసం జీవిత రాజశేఖర్ కొన్ని ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. గరుడ వేగ సినిమా నిర్మాత జోస్టర్ గ్రూప్ చైర్మన్ ఎం.డి, చర హేమ ,కోటేశ్వర రాజు కు 26 కోట్లు బకాయి పడినట్లు తెలిసింది. ఇక వారి బకాయిలు చెల్లించకుండా కొన్ని చెక్ లతో హామీ ఇవ్వగా అవి కాస్త బౌన్స్ అయ్యాయి. చెక్స్ బౌన్స్ కావడంతో తమిళనాడు తిరువళ్ళూరు, ఏపి లోని నగరి కోర్టులో న్యాయ పోరాటం మొదకు పెట్టారు.

Recommended Video

కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia

గరుడ వేగ ఫైనాన్స్, నిర్మాతలు జోస్టర్ గ్రూప్ చైర్మన్, ఎం.డి ఇప్పుడు చట్టపరంగా మరింత ఒత్తిడి పెంచాలని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నగరి కోర్టులో హాజరైన జీవిత అక్కడ ఇతర న్యాయవాదులతో కలిసి కూడా మాట్లాడారు అంతేకాకుండా అక్కడ సమీపంలో ఉన్న జనాలు కూడా ఆమె ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. జీవిత రాజశేఖర్ కూడా వారితో ఆప్యాయంగా ఫోటోలకు అనుమతులు ఇచ్చారు. ఇక కొనసాగుతున్న ఈ కేసు విషయంలో జీవిత రాజశేఖర్ నిర్మాతలతో మాట్లాడి త్వరలోనే ఒక సొల్యూషన్ తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X