పెళ్లి సందడి అంటే ఇదే.. వారు పుట్టకముందే.. ఝాన్సీ పోస్ట్ వైరల్
ప్రస్తుతం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నాటి పెళ్లి సందడి మ్యాజిక్‌ను మరోసారి క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ రవళి దీప్తి భట్నాగర్ కాంబినేషన్‌లో తెరకెక్కించిన పెళ్లి సందడి ఓ చరిత్ర. కాసుల వర్షాన్ని కురిపించి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించిన 'పెళ్లి సందడి'ని మరోసారి రీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పెట్టి పెళ్లి సందడిని తెరకెక్కిస్తున్నారు.

మొదటగా అలా..
పెళ్లి సందడి చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించబోతోన్నారనే రూమర్లు బయటకు వచ్చిన కొత్తలో రాఘవేంద్ర రావు మళ్లీ మెగా ఫోన్ పట్టబోతోన్నట్టు చెప్పుకొచ్చారు. తీరా చూస్తూ దర్శకేంద్రుడి పర్యవేక్షణలో తెరకెక్కబోతోందని ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన తారాగణం ఇలా అన్నింట్లోనూ దర్శకేంద్రుడిదే తుది నిర్ణయమని తెలుస్తోంది.

తెరనిండా తారాగణమే..
మామూలుగా దర్శకేంద్రుడి సినిమా అంటే తెరనిండా రంగులమయం, ప్రతీ ఫ్రేమ్‌లో నిండుదనం కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి సందడి సినిమా చూస్తుంటే నిజంగానే ఇంట్లో పెళ్లి జరిగిన సందడి కనిపిస్తుంటుంది. కొత్తగా తెరకెక్కిస్తోన్న సినిమాలో ప్రతీ ఫ్రేమ్ నిండుగానే కనిపించేలా ఉంది.

పాటల చిత్రీకరణ..
ప్రస్తుతం పెళ్లి సందడి సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో సినిమాలోని తారాగణం అంతా కూడా పాల్గొంది. ఇందులో దాదాపు యాభై మంది దాక ఆర్టిస్టులున్నట్టు కనిపిస్తోంది. నిజంగా ఇది పెళ్లి సందడే అంటూ నటి ఝాన్సీ ఓ పోస్ట్ చేసింది.

వారు పుట్టకముందే..
పెళ్లి సందడి అంటే ఇదీ.. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగుతోంది.. గౌరీ రోనంకి దర్శకత్వంలో పెళ్లి సందడి 2 తెరకెక్కుతోంది. వారు పుట్టకముందే జరిగిన ఓ అద్భుతాన్ని మళ్లీ రీక్రియేట్ చేయడంలో రోషన్, శ్రీ లీలలు ఎంతో చక్కగా నటిస్తున్నారంటూ ఝాన్సీ చెప్పుకొచ్చింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తోన్నట్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











