జనాల ఇళ్లలోకి వదలడానికి ముఖ్యమైన వార్తలు లేవా? మీడియాపై ఝాన్సీ ఎటాక్

నటి ఝాన్సీ మీడియాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వ్యవహారంలో మీడియా అత్యుత్సాహం మీద ఆమె ఈ కామెంట్లు చేసినట్లు అర్థమవుతోంది. ఝాన్సీ చేసిన కామెంట్లు విషయానికి వస్తే

సోషల్ మీడియాలో యాక్టివ్ గా

సోషల్ మీడియాలో యాక్టివ్ గా

యాంకర్ గా, నటిగా ఝాన్సీ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఒకానొక సమయంలో యాంకర్ సుమ తో పోటాపోటీగా టెలివిజన్ కార్యక్రమాలు చేసిన ఝాన్సీ ప్రేమ వివాహం తర్వాత తర్వాత సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఇక ఆమె ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఝాన్సీ కొద్ది రోజులుగా మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

 వివాదాలు కొత్తేమీ కాదు.

వివాదాలు కొత్తేమీ కాదు.

నిజానికి ఝాన్సీకి వివాదాలు కొత్తేమీ కాదు. సమాజంలో జరిగే ఎన్నో అంశాల మీద ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. అయితే చాలా సార్లు అలా స్పందించినందుకు ట్రోలింగ్‌కు కూడా గురవుతూ ఉంటారు. అలాగే తాజాగా ఆమె మీడియాపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె ఓ పోస్ట్‌ చేశారు. మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

 ఆ పుండులో పురుగులు

ఆ పుండులో పురుగులు

''అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు.. ఎద్దు పుండు కాకికి ముద్దు! కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పుండు పెద్దది చేసాయి, ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచాయి అంటూ ఆమె ఒక కథ లాగా చెప్పుకొచ్చారు.

కాకుల్లారా

కాకుల్లారా

మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా?" సినిమా ఇంట పెళ్లి అయినా, విడాకులయినా ఎన్నికలైనా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా... ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి అంటూ ఆమె కామెంట్లు చేశారు.

హిప్నోటిక్ కెమెరా లెన్స్‌లను

హిప్నోటిక్ కెమెరా లెన్స్‌లను

మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కాదు ... వారు మీరు ఏమి చూడాలనుకుంటున్నారో అదే మీరు చూడవలసి వస్తుందని, మనమందరం వాచ్ డాగ్స్ బలిపశువులం అంటూ ఆమె కామెంట్లు చేశారు. హిప్నోటిక్ కెమెరా లెన్స్‌లను చూసినప్పుడు జనం వారి ఇంద్రియాలను కోల్పోతున్నారని, ఈ అర్ధంలేని మాటలతో దూరంగా ఉండండని, మీ వార్తలను జాగ్రత్తగా ఎంచుకోండని ఆమె సూచించారు.

Recommended Video

Hero Harsha Narra Making Fun Of Team In Bus Tour | Missing Movie

విడాకులు తీసుకున్న సమయంలో

నిజానికి ఒక నటుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిదేళ్ల వివాహ బంధం అనంతరం మళ్లీ విడాకులు తీసుకున్నారు. వీరు విడాకులు తీసుకున్న సమయంలో కూడా మీడియా పలు విధాలుగా కథనాలు వెలువరించింది అని ఆమె గతంలో కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అదే విధంగా సమంత నాగ చైతన్య వ్యవహారం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక వ్యవహారంలో మీడియా స్పందన చూసి ఝాన్సీ ఈ మేరకు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంలో మీడియా ఎక్కువ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X