వర్మ 'నిశ్శబ్ద్' హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య
ముంబయి: బాలీవుడ్ నటి జియాఖాన్ సోమవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలోనూ నటించారు.
జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన జుహులోని ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
జియా ఇరుగు పొరుగు వారితో పాటు వాచ్‌మెన్ కూడా ఈ సందర్భంగా విచారించారు. లండన్ లో పుట్టిపెరగిన ఆమె రీసెంట్ గా తన తల్లి రబియాతో కలిసి ముంబై షిప్ట్ అయ్యారు.
ఆమె తన పర్శనల్ కారణాలతో చాలా డిప్రెషన్ లో ఉంది, కానీ త్వరలో నటనపై పూర్తి దృష్టి పెడదామనుకుంది. అందుకోసం ముంబైలో ఫిల్మ్ మేకర్స్ ని రోజూ కలుస్తోంది. ఈ లోగా ఇలా జరిగిపోయిందని ఆమె కు చెందిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications












