»   » అసభ్య సన్నివేశాలు: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు

అసభ్య సన్నివేశాలు: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: సినిమా సైన్ చేసే సమయంలో దర్శకుడు చెప్పేదొకటి... వారితో అగ్రిమెంటు తర్వాత సినిమా షూటింగ్ మొదలయ్యాక వారితో చేయించే పనులు మరొకటి. ఇలాంటి అశ్లీలం, అసభ్యతతో కూడిన సీన్లు మేము చేయం అని హీరోయిన్లు ఎదురు తిరిగితే నీకు పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేస్తామనో లేక మరో రకంగానో బెదిరింపులు.

పవన్‌ కళ్యాణ్‌పై డౌట్: మాల్దీవుల్లో మాజీ భార్య, పిల్లలతో...?( ఫోటోస్)

కథలో, స్క్రీన్ ప్లే విషయంలో దమ్ము చూపలేని దర్శకులు కొందరు కేవలం హీరోయిన్ల స్కిన్ షో మీదే ఆధారపడి సినిమాను నడిపించాలనే నీచమైన ఆలోచనలతో ఇలాంటివి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు చాలా వెలుగు చూసాయి. కొందరు హీరోయిన్లు ధైర్యంగా ఎదురు తిరిగడం, కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తున్నారు.

ఆదిత్య 369: బాలయ్య కోసం చిరు యాడ్స్ (25 ఏళ్ల జ్ఞాపకాలు)

సినిమాల్లోనే కాదు... షార్ట్ ఫిల్మ్ స్థాయిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన యోగి అనే షార్ట్ ఫిల్మ్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. జోషి అనే నటి ఫిర్యాదు మేరకు దర్శకుడిపై ఐపిసి సెక్షన్లు 509, 506 కింద కేసు నమోదు చేసారు.

 Actress Joshi Files Case On Short Film Director Yogi

అనుభవించు రాజా...! అఖిల్ అక్కినేని లవ్ ఎఫైర్లో మరో కోణం!

యోగి దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్ చేసేందుకు ఒప్పుకున్నానని... అయితే షూటింగ్ మొదలయ్యాక నాకు ముందుగా చెప్పని అసభ్యకరమైన సీన్లు, సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి తెస్తున్నాడని, తాను నటించనని చెప్పడంతో సినిమాల్లో లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని, షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీలను ఆశ్రయించింది నటి జోషి.

English summary
Actress Joshi has filed a case against short film director Yogi at Jubilee Hills PS in Hyderabad. The actress, in her complaint alleged that the director has been pressurising her to portray some roles in the objectionable scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu