ప్రేమ పేరుతో వెంటపడ్డారు.. విడాకులకు కారణం, విచ్చలవిడిగా తిరుగుతోంది చూడు అంటూ!

వ్యాంప్ తరహా పాత్రతో నటి జ్యోతి గుర్తింపు పొందింది. నటి జ్యోతి పేరు చెప్పగానే పెళ్ళాం ఊరెళితే, ఎవడి గోల వాడిది, మహాత్మా వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఎస్వి కృష్ణారెడ్డి చిత్రం హంగామాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో నటి జ్యోతి తన సినీ జీవితం గురించి, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి జ్యోతి సంచలన విషయాలు వెల్లడించింది.

2002లో ఇండస్ట్రీలోకి

2002లో ఇండస్ట్రీలోకి

అలీతో సరదాగా కార్యక్రమంలో జ్యోతి మాట్లాడుతూ.. 2002 లో మందారం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యా. నాట్యంపై నాకు ఉన్న ఆసక్తి చూసి మా నాన్నే నన్ను ఇండస్ట్రీకి వెళ్లేలా ప్రోత్సహించారు అని జ్యోతి తెలిపింది. కానీ నేనెప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. నేను నటిగామారడం అనుకోకుండా జరిగిన సంఘటన అని జ్యోతి తెలిపింది.

ఆయన దేవుడిలాంటి వారు

ఆయన దేవుడిలాంటి వారు

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నాకు దేవుడులాంటి వారు. ఆయన చిత్రాల వలనే నాకు మంచి గుర్తింపు దక్కిందని జ్యోతి తెలిపింది. మొదట పెళ్ళాం ఊరెళితే చిత్రంలో వ్యాంప్ తరహా పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర చేయడానికి మొదట భయపడ్డాను. ఎస్వీ కృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే ఆ పాత్ర చేశా. ఆ తరువాత ఆయనే హంగామా చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని జ్యోతి తెలిపింది.

ఈవీవీ సత్యనారాయణతో గొడవ

ఈవీవీ సత్యనారాయణతో గొడవ

సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణతో జరిగిన గొడవ విషయాన్ని కూడా జ్యోతి ప్రస్తావించింది. నేను సీనియర్ దర్శకుడిని. ఎలాంటి పాత్ర ఇచ్చిన చేయాలి అనే స్వభావం ఆయనది అని జ్యోతి తెలిపింది. కితకితలు చిత్రంలో ఓ సన్నివేశం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మార్చమని ఆయన్ని రిక్వస్ట్ చేశా. నేను చెబితేనే చేయవా అంటూ గట్టిగా అరిచారు. వెంటనే సెట్స్ నుంచి వెళ్ళిపోయా అని జ్యోతి తెలిపింది.

పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడు

పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడు

తన వ్యక్తిగత జీవితం గురించి కూడా జ్యోతి ప్రస్తావించింది. చాలా యంగ్ ఏజ్ లోనే నాకు వివాహం జరిగింది. నాకు బాబు కూడా ఉన్నాడు. మా వారు, నేను విడాకుల ద్వారా విడిపోయాం. మెచ్యూరిటీ లేకపోవడం వలనే ఆలా జరిగింది అని జ్యోతి తెలిపింది.

ఆ బాధ నన్ను వేధిస్తోంది

ఆ బాధ నన్ను వేధిస్తోంది

తన వివాహ జీవితం, కొడుకు గురించి మాట్లాడుతూ జ్యోతి ఎమోషనల్ అయింది. కన్నీరు పెట్టుకుంది. నా కొడుకు వాళ్ళ నాన్న గురించి అడిగినప్పుడు చాలా భాధగా అనిపిస్తుంది. మా ఇద్దరి గొడవల వలన వాడికి తండ్రి దూరమయ్యాడే అని ఎప్పుడూ భాదపడుతోనే ఉంటా అంటూ జ్యోతి కంటతడి పెట్టుకుంది.

ప్రేమ పేరుతో వెంటపడ్డారు

ప్రేమ పేరుతో వెంటపడ్డారు

చాలా మంది ప్రేమ పేరుతో వెంట పడ్డారు. ఒకసారి శుభలేఖల వరకు వచ్చి బ్రేకప్ అయింది అని జ్యోతి తెలిపింది. ప్రేమని పక్కన పెట్టి పెళ్లి చేసుకుంటే అది కూడా ఫెయిల్ అయిందని జ్యోతి తెలిపింది. నా కొడుకు నాతోనే ఉండడం సంతోషాన్ని ఇచ్చే విషయం అని జ్యోతి తెలిపింది.

విమానాశ్రయంలో అసభ్యంగా

విమానాశ్రయంలో అసభ్యంగా

తాను వ్యాంప్ పాత్రలు చేయడం వలన జనాలు నా గురించి చెడుగా మాట్లాడితే భాదగా అనిపిస్తుంది. ఒకసారి ఎయిర్ పోర్ట్ లో టికెట్ కోసం నిల్చుని ఉంటె.. విచ్చలవిడిగా తిరిగేస్తోంది చూడు అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ తో నా మతి పోయింది అని జ్యోతి తెలిపింది.

దుబాయ్ నుంచి వచ్చాక

దుబాయ్ నుంచి వచ్చాక

వివాహం చేసుకుని దుబాయ్ వెళ్ళాక భర్తతో విభేదాలు వచ్చాయి. మేమిద్దరం విడిపోయాక తిరిగి వచ్చేశా. మళ్ళి సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంటే పరుచూరి గోపాల కృష్ణ గారి సాయంతో మహాత్మ చిత్రంలో అవకాశం వచ్చిందని జ్యోతి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X