ఆ కసితో పెళ్లి చేసుకున్నా.. రెండు లవ్ ఫెయిల్యూర్స్.. నా జీవితానికి వాడు చాలు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అడల్ట్ కామెడీ తరహాలో ఉండే రోల్స్ లో జ్యోతి ఎక్కువగా నటించింది. జ్యోతి తెలుగు బిగ్ బాస్ 1 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని వెల్లడించింది. ప్రేమ, బ్రేకప్, పెళ్లి లాంటి అంశాలు తన జీవితంలో చేదు అనుభవాలుగా మిగిలిపోయాయని జ్యోతి తెలిపింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో
తనకు టాలీవుడ్ లో ఇష్టమైన దర్శకుడు కృష్ణవంశీ అని జ్యోతి తెలిపింది. ఆయన చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అయన అనుకున్న విధంగా అన్ని పాత్రలలో మంచి నటన వచ్చేవరకు నిద్రపోరు అని జ్యోతి తెలిపింది. కృష్ణవంశీ దర్శత్వంలో నటించాను కాబట్టి తనకు ఈ విషయాలన్నీ తెలుసు అని తెలిపింది.తనకు వచ్చిన అన్ని అవకాశాలని వినియోగించుకుంటూ నటిస్తున్నానని జ్యోతి తెలిపింది.

వ్యక్తిగత జీవితం
ఇంటర్వ్యూలో మీకు పెళ్లి అయినట్లే అనిపించడం లేదు అని యాంకర్ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు కూడా అనుకోవద్దు అని జ్యోతి సరదాగా వ్యాఖ్యానించింది. తన కెరీర్ ఆరంభంలో రెండు లవ్ ఫెయిల్యూర్స్ వలన ఇబ్బంది పడ్డానని జ్యోతి తెలిపింది. ప్రేమలో సక్సెస్ కాలేక పోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఓ ఈవెంట్ సందర్భంగా తన మాజీ భర్తతో పరిచయం ఏర్పడిందని జ్యోతి తెలిపింది.

కసితో పెళ్లి చేసుకున్నా
ఆ సమయంలో నాకు మెచ్యూరిటీ లేదు. పైగా ప్రేమ విఫలం అయిందనే భాద ఉంది. ఆ సమయంలో ఈవెంట్ లో మా ఇద్దరికీ పరిచయం అయింది. ఆయన పెళ్లి పట్ల సిన్సియర్ గా కనిపించారు. ప్రేమ విఫలమైందనే కసితో పెళ్లి చేసుకున్నా. నేనెంత తప్పు చేసానో పెళ్లి తర్వాతే అర్థం అయింది. మా ఇద్దరికీ మెచ్యూరిటీ లేకపోవడం వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తాయి. అవి చిన్న చిన్న గొడవలే. కానీ ఆ సమయంలో పెద్దవిగా అనిపించాయి. అందుకే విడిపోయినట్లు జ్యోతి తెలిపింది.

నా జీవితానికి వాడు చాలు
దేవుడు నాకిచ్చిన గొప్ప బహుభామతి నా కొడుకు. నా జీవితానికి వాడు చాలు. ఇంకెవరూ అవసరం లేదు. కానీ మేము చేసిన తప్పు వలన నా కొడుకు తండ్రి దూరమయ్యాడని తరచుగా భాదపడుతుంటా అని జ్యోతి తెలిపింది. అవకాశం దొరికితే వాడిని కూడా సినిమాల్లోకి తీసుకువస్తా అని జ్యోతి తెలిపింది.


Click it and Unblock the Notifications











