సెక్స్ మాత్రలు అమ్ముతున్న సినీతార!
హైదరాబాద్: సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కనిపించే నటి జ్యోతి గుర్తుందా? అదేనండీ ఆ మధ్య వ్యభిచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంది.... ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి నేను ఏ తప్పూ చేయలేదు అంటూ గగ్గోలు పెట్టింది. ఆవిడ తప్పు చేసిందా? లేదా? అనే సంగతేమో గానీ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
కొంత కాలంగా తెరమరుగైన జ్యోతి తాజాగా సెక్స్ మాత్ర విక్రయంతో వార్తల్లోకెక్కింది. 'శక్తి ప్రకాష్' అనే శృంగార ఉత్ప్రేరక మాత్రలకు ప్రచార కర్తగా మారింది. టీవీల్లో వచ్చే టెలి షాపింగ్ ఫ్రోగ్రాంలో ఈ మాత్రలు కొనండి... మీలో కామకోరికలు పెరిగి మీ భాగస్వామితో సెక్స్ బాగా ఎంజయ్ చేస్తారు అంటూ ప్రచారం చేస్తోంది.
ఆ మధ్య 'పెళ్లాం ఊరెలితే' చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన జ్యోతికి... చాలా సినిమాల్లో అలాంటి పాత్రలే వచ్చాయి. కారణమేంటో తెలియదు కానీ నిజ జీవితంలో కూడా జ్యోతి వ్యభిచారంలో దిగడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఇదంతా గతం. తాజాగా జ్యోతి సెక్స్ మాత్రల బిజినెస్‌లోకి దిగడంతో.... అలాంటి సంస్థలు మరిన్ని జ్యోతిని కాంటాక్టు చేసి తమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని అడుగుతున్నారు.
సాధారణంగా సెక్స్ మాత్రలకు, కండోమ్స్‌కి జనాల్లో పాపులారిటీ ఉండే సినీ స్టార్లతో ప్రచారం చేయిస్తే మంచి అమ్మకాలు బాగుంటాయని సదరు సంస్థలు భావిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది ఇలాంటి చేయడానికి ఇష్ట పడరు. ఇదే చాన్స్ గా జ్యోతి లాంటి సినిమా అవకాశాలు లేని ఫేడౌట్ అయిన తారలు ఈ రంగంలోకి దిగి ఉపాది పొందుతున్నారు.


Click it and Unblock the Notifications











