జూ. ఎన్టీఆరే సరైనోడు, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది.. నటి జ్యోతి హాట్ కామెంట్స్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గ్లామర్ టచ్ ఉండే రోల్స్ లో చెలరేగి నటించడం జ్యోతి శైలి. జ్యోతి తెలుగు బిగ్ బాస్ 1 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. మరి కొన్ని నెలల్లో బిగ్ బాస్ 3 ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా జ్యోతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ 1తో పోల్చుతూ బిగ్ బాస్ 2పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇష్టారాజ్యం

ఇష్టారాజ్యం

బిగ్ బాస్ 1లో జ్యోతి కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. ఆ ఛాన్స్ బిగ్ బాస్ 2లో వచ్చి ఉంటే బావుండేది అని జ్యోతి తెలిపింది. బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్స్ కు చాలా ఫ్రీడమ్ ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే హౌస్ లో తమ ఇష్టారాజ్యం అన్నట్లుగా కంటెస్టెంట్స్ ఉండేవాళ్ళు. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అలాంటి అవకాశం నాకు వచ్చిఉంటే బావుండేది అని జ్యోతి తెలిపింది.

ఎన్టీఆరే సరైనోడు

ఎన్టీఆరే సరైనోడు

బిగ్ బాస్2 లో ఏ కంటెస్టెంట్ కు భయం లేదు. కానీ బిగ్ బాస్ 1లో అలా కాదు. హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి భయం ఉండేది. ఎన్టీఆర్ వస్తుంటే ఆ హుందాతనమే వేరుగా ఉండేది. ఎన్టీఆర్ ఎప్పుడొచ్చి ఏం మాట్లాడతాడో అని అంతా వణికిపోయేవారు. బిగ్ బాస్ అంటే అజ్ఞాతవ్యక్తి. ఆ వాయిస్ గంభీరంగా ఉండాలి. ఈ మొత్తం సెటప్ ని నడిపించే హోస్ట్ గా ఎన్టీఆరే సరైన హోస్ట్ అని జ్యోతి అభిప్రాయపడింది.

విమానాశ్రయం నుంచే

విమానాశ్రయం నుంచే

బిగ్ బాస్ 2ని హైదరాబాద్ లోనే నిర్వహించడం కూడా ఓ మైనస్ అని తెలిపింది. హైదరాబాద్ లో నిర్వహించడం వలన కంటెస్టెంట్స్ లో భయం లేదు. మాకు అలా కాదు. మహారాష్ట్రలో ఎక్కడో లూనావ్యాలీకి తీసుకుని వెళ్లారు. విమానాశ్రయం నుంచి మాపై నిఘా ఉండేది. కళ్ళకు గంతలు కట్టి షూటింగ్ లొకేషన్ కు తీసుకుని వెళ్లారు. అంత ఒత్తిడి మాపై ఉండడం వలన చాలా భయంగా షోలో పాల్గొన్నట్లు జ్యోతి తెలిపింది.

బిగ్‌బాస్ 3

బిగ్‌బాస్ 3

ఇక బిగ్ బాస్ 3 గురించి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఈ షోకి సంబంధించిన కొన్ని విషయాలు తనకు తెలిశాయని జ్యోతి తెలిపింది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ గా వరుణ్ సందేశ్, ఉదయభాను, చార్మి పేర్లు వినిపిస్తున్నాయని జ్యోతి తెలిపింది. బిగ్ బాస్ షోలో ఎక్కువరోజులు పాల్గొంటే ఎంతో కొంత ఒత్తిడి ఉంటుందని తెలిపింది. ఏదో ఒక సందర్భంలో మనం గొడవపడేలా పరిస్థితులు క్రియేట్ చేస్తారు. వాళ్లకు కావలసింది కూడా అదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X