SuriyaJyothika : 'నీ భర్తను ఒక రాత్రికి పంపవా' - ఆమెకు గట్టిగా ఇచ్చినపడేసిన జ్యోతిక!

సీనియర్ నటి జ్యోతిక ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్​లో జోరు చూపించడం మొదలుపెట్టింది. వరుసపెట్టి సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య రెండు మూడు చిత్రాలతో వచ్చి మంచి సక్సెస్​ను అందుకుంది. దీంతో సక్సెస్​ను ఎంజాయ్​ చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. అభిమానులతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలోనే ఒక లేడీ ఫ్యాన్స్​ నీ భర్త సూర్యను ఒక నైట్​కు పంపిస్తా అంటూ వింత కోరికను కోరింది. దీంతో జ్యోతిక అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

ఇండస్ట్రీ స్టార్ కపుల్స్​లో సూర్య - జ్యోతిక ఒకరు. 2006లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి. అయితే సూర్య ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగారు. ముఖ్యంగా అమ్మాయిలలో మస్త్ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ జ్యోతిక మాత్రం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఇంటి బాధ్యతలను చూసుకున్నారు.

Actress Jyothika gave strong reply for fan who asks suriya for oneday post viral See the full details in this story

అయితే ఇన్నేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోబోతున్నట్లు కొంత కాలం నుంచి బాగా వార్తలు వచ్చాయి. అలానే జ్యోతిక-సూర్య తన కుటుంబ సభ్యులతో సఖ్యత కుదరట్లేదని అందుకే వీరు ముంబయికి షిప్ట్ అయిపోయినట్లు కూడా ప్రచారం సాగింది. అయితే ఈ జంట ఈ రూమర్స్​కు చెక్​ పెట్టారు. తమ బంధం బలంగానే ఉందని కలిసి ఉన్న వీడియోలను పోస్ట్ చేశారు. గొడవలు కూడా ఏమీ లేవని, ముంబయికి షిప్ట్ అవ్వడానికి మరో కారణం ఉందని కూడా చెప్పారు.

ఇకపోతే జ్యోతిక ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్​ మొదలుపెట్టింది. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ మధ్య రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి హిట్​ను కూడా అందుకుంది. ఇక సూర్య, జ్యోతిక నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. తాజాగా జ్యోతి బాలీవుడ్​లో సైతాన్ చిత్రంతో మరో హిట్​ను కూడా అందుకుంది. ఇందులో మాధవన్, అజయ్​ దేవగణ్ కలిసి నటించారు. ఆ తర్వాత శ్రీ, డబ్బా కార్టెల్ అనే చిత్రాల్లో నటించనుంది జ్యోతిక.

Actress Jyothika gave strong reply for fan who asks suriya for oneday post viral See the full details in this story

అయితే ఈ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక.. సూర్య, మాధవన్, అజయ్ దేవ్ గన్ కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఓ అభిమాని తన వింత కోరికను బయటపెట్టింది. జ్యోతిక మేడమ్​ సిల్లును ఒరు కాదల్ చిత్రంలో లాగా నాకు మీ భర్త సూర్యను ఒక రోజుకు పంపించండి అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక రిప్లై ఇచ్చింది. అస్సలు అలా చేయడం కుదరదు అంటూ స్ట్రాంగ్​గా చెప్పుకొచ్చింది.

అయితే జ్యోతిక రిప్లై ఇవ్వగానే సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మీరు రిప్లై ఇవ్వడమే గొప్ప విషయంగా భావిస్తున్నాను అంటూ తిరిగి బదులిచ్చింది. ఇక జ్యోతిక రిప్లైతో మరోసారి ఆమె సూర్యపై తనకున్న ప్రేమను చాటి చెప్పినట్టైంది. ఇది రీల్ లైఫ్ కాదమ్మా రియల్ లైఫ్​ అనేలా సమాధానం చెప్పింది. ఇకపోతే సూర్య ప్రస్తుతం కంగువా అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శివ దీన్ని తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X