»   »  అమ్మా.. ఏమిటది.. చాలా బ్యాడ్.. తల్లి కాజోల్‌ను తప్పుపట్టిన కూతురు

అమ్మా.. ఏమిటది.. చాలా బ్యాడ్.. తల్లి కాజోల్‌ను తప్పుపట్టిన కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెరమీద ఎన్నో పాత్రలను పోషించి విశేషంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటి కాజోల్‌ను ఏ కోణంలోనూ తప్పుపట్టిన వారెవరూ లేరు. కానీ సోషల్ మీడియా తల్లి అనుసరించే తీరును మాత్రం కాజోల్ కూతురు నైసా దేవగణ్ తప్పుపట్టింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్ పెట్టిన ఫొటోను ఉద్దేశించి.. ఏమిటా ఫొటో.. చాలా బ్యాడ్‌గా ఉన్నది అని 13 ఏండ్ల నైసా కామెంట్ చేసింది. ఎందుకంటే కాజోల్‌ను సోషల్ మీడియాకు పరిచయం చేసింది నైసానే.

 Actress Kajol Trolled By Daughter Nysa

గతంలో సోషల్ మీడియా అంటే తనకు అసలేమి తెలియదని, నైసా ప్రోత్సాహంతోనే అందులోకి ప్రవేశించానని కాజోల్ పేర్కొన్నారు. అందరి ఇంట్లో మాదిరిగానే నైసా తన తమ్ముడు యుగ్‌ ఎప్పుడూ పొట్లాడుకొంటారని ఇటీవల సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.

ప్రస్తుతం కాజోల్ ధనుష్ చిత్రం వీఐపీ2లో నటిస్తున్నది. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వ్యాపారవేత్తగా నటిస్తున్నది.

English summary
Kajol is presently busy shooting for Tamil film VIP 2. Kajol plays a businesswoman in the film directed by Rajinikanth's daughter Soundarya
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu