»   » నటి కళ్యాణి అరెస్ట్, పేకాటేనా... ఇంకేమైనా? (ఫోటో)

నటి కళ్యాణి అరెస్ట్, పేకాటేనా... ఇంకేమైనా? (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జహంగీర్‌నగర్‌లో పేకాట స్థావరాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 11మందిని అరెస్ట్‌ చేసి రూ.77వేల నగదు, 8సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సినీనటి కళ్యాణి కూడా ఉన్నారు.

Actress Kalyani Arrested For Playing Cards

ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసారు. అయితే నటి కళ్యాణ్ (కరాటే కళ్యాణి) కూడా పట్టుబడటం హాట్ టాపిక్ అయింది. కమెడీ పాత్రల్లో, హాట్ ఆంటీగా పలు సినిమాల్లో నటించిన కళ్యాణి మిరపకాయ్ చిత్రంలో ‘అబ్భ...' అనే మ్యానిరిజంతో పాపులర్ అయింది. అనే మా ఇలా పేకాట ఆడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Actress Kalyani Arrested For Playing Cards

ఆమె కేవలం పేకాట ఆడటానికే ఇక్కడికి వచ్చిందా? లేక మరేదైనా అసాంఘీక కార్యకలాపాలా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె పోలీసుల ముందు తాను పేకాట ఆడేందుకే వచ్చినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పలువురు సినీమణులు పలు అసాంఘీక కార్యకలాపాల్లో పట్టుబడుతున్ననేపథ్యంలో కళ్యాణి పేకాట విషయం చర్చనీయాంశం అయింది.

English summary
Tollywood actress Kalyani Arrested For Playing Cards.
Please Wait while comments are loading...