అదే..కళ్యాణి కొత్త బిజెనెస్!

By Staff

Kalyani
కబడ్డి..కబడ్డి సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చి పెద్ద హీరోలతో సైతం నటించిన కళ్యాణి ఈ మధ్య బిజెనెస్ చేస్తున్నానని చెప్తోంది.దాంతో ఆమె ఏం వ్యాపారం చేస్తోందో అని అడిగితే వెంటనే ప్రొడక్షన్ అని చెప్తోంది. ఇదే రూటులో భూమిక కూడా పెళ్ళాడి...సినిమా ఆఫర్స్ తగ్గగానే సినిమా నిర్మాణంతో రకరకాల బిజినెస్ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది మిగతా మాజీ నటీమణులకు కూడా ఉత్సాహాన్నిస్తున్నట్లుంది.

వారు కూడా ఆమె బాటలో నడవటానికి నడుం బిగిస్తున్నారు. ఆ ప్రేరణతోనే తాజాగా కళ్యాణి ప్రొడక్షన్ రంగంలోకి దూకుతోంది. తన భర్త సూర్య కిరణ్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా నిర్మించటానికి సిద్దపడుతోంది. సత్యం తరువాత సూర్యకిరణ్ టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా హిట్టుని సాధించలేకపోయాడు.దాంతో నిరాశచెందిన అతను గత కొంత కాలంగా సినీ రంగానికి దూరంగా ఉన్నాడు. భర్తనీ ప్రోత్సహించనట్లువుతుంది. తనకీ చేతినిండా పనిఉంటుందని భావించిన కళ్యాణి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతోంది.అధ్యాయం ఆరు పేరుతో నిర్మాణమయ్యే ఈ సినిమాకి అందరని కొత్త వారిని పరిచయం చేస్తూ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆరు ఛాప్టర్స్ గా స్క్రీన్ ప్లే సాగుందని,అలాగే ప్రతి చాప్టర్ ఒక్కో కథను చెపుతుందని,అలాగే ఆ కథ మూడ్ ని అనుసరించే కలర్స్ కూడా వాడనున్నట్లు సూర్యకిరణ్ చెప్తున్నాడు. ఇక తమిళ్ లో ఈ సినిమా వర్కవుట్ అయితే తెలుగులోకి డబ్ చేసే ఆలోచనలో ఉన్నామని భార్యాభర్తలు చెపుతున్నారు. ఈ సారన్నా సినిమా హిట్టు కావాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X