ఇందిరా గాంధీగా కంగన రనౌత్... వివాదాస్పద అంశాలతో పొలిటికల్ డ్రామా
వీర నారి ఝాన్సీ రాణి, తమిళనాడు మాజీ సీఎం స్వర్గీయ జయలలిత పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరో గొప్ప పాత్రలో కనిపించబోతున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఓ చిత్రంలో కంగన ఇందిరాగాంధీగా నటించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు నటించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
రాజకీయ నేపథ్యంతో రూపొందిన తలైవి చిత్రం తర్వాత కంగన నటించే రెండో పొలిటికల్ థ్రిలర్ కావడం గమనార్హం.

ఇందిరా గాంధీ నటించడంపై కంగన రనౌత్ స్పందిస్తూ... మీరు విన్న వార్త నిజమే. భారీ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఇందిరా గాంధీ బయోపిక్ మాత్రం కాదు. రాజకీయ చరిత్ర, పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్నది అని అన్నారు.
పొలిటికల్ డ్రామాలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. భారతీయ రాజకీయ చరిత్రలో కీలకమైన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ లాంటి ఘటనలతో ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మురార్జీ దేశాయ్, లాల్ బహద్దూర్ శాస్త్రి లాంటి పాత్రలు ఉంటాయి అని కంగన రనౌత్ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
గతంలో కంగన రనౌత్‌తో రివాల్వర్ రాణి రూపొందించిన దర్శకుడు సాయి కబీర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేతోపాటు దర్శకత్వం వహించనున్నారు.


Click it and Unblock the Notifications











