పెళ్లి గురించి నా జాతకంలోనే అలా ఉంది.. అలీతో తన లైఫ్ సీక్రెట్స్ చెప్పిన కరాటే కళ్యాణి!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి పలు చిత్రాల్లో నటించించింది. కృష్ణ, మిరపకాయ్ లాంటి చిత్రాల్లో కరాటే కళ్యాణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ప్రముఖ కమెడియన్ అలీ ప్రస్తుతం బుల్లి తెరపై కూడా రాణిస్తున్నాడు. అలీతో సరదాగా షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షోకు అతిథిగా కరాటే కళ్యాణి హాజరైంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కరాటే కళ్యాణి ఈ షోలో పంచుకుంది.

పోలీస్ జాబ్ కోసం
కరాటే కళ్యాణ్ మాట్లాడుతూ..నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ జాబ్ చేయాలని ఆసక్తిగా ఉండేది అని తెలిపింది. కరాటే అనేది నా ఇంటిపేరు కాదు. చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకున్నా. బ్లాక్ బెల్ట్ సాధించా. జాతీయ స్థాయి పోటీలో నాలుగుసార్లు గోల్డ్ మెడల్ సాధించినట్లు కళ్యాణి తెలిపింది. అలా తనని అంతా కరాటే కళ్యాణి అని పిలుస్తారని తెలిపింది. మాది చాలా పేద కుటుంబం. జాతీయస్థాయి పోటీలకు మా నాన్న చాలా కష్టపడి పంపారు అని కళ్యాణి తెలిపింది. స్పోర్ట్స్ కోటాలో నాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేది. కానీ నేను సరిగా చదవలేదని కళ్యాణి తెలిపింది.

5వ తరగతిలోనే పేకాట
5వ తరగతిలోనే పేకాట అడవంట కదా అని అలీ అడగగా.. కరాటే కళ్యాణి నవ్వుతో అవునని సమాధానం ఇచ్చింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటి వెనుక పేకాటా ఆడేవారు. ప్రతి రోజూ చూడడానికి వెళ్లేదానిని. ఒక రోజు రూపాయి పందెం వేసి గెలిచా. దీనితో స్కూల్ ఎగ్గొట్టి రోజూ ఆడడం మొదలు పెట్టా. ఒకరోజు ఇంట్లో తెలిసిపోవడంతో నాన్న జామచెట్టుపై కట్టేసి మరీ కొట్టారు అని కళ్యాణి తెలిపింది.

పెళ్లి గురించి అడగానే
అలీ పెళ్లి గురించి అడగానే.. ఇప్పుడు అవసరమా సర్ పెళ్లి గురించి అంటూ భావోద్వేగానికి గురైంది. నా జీవితంలో ప్రేమ, పెళ్లి రెండూ కలసి రాలేదని తెలిపింది. నాకు పెళ్లి కలసిరాదనే విషయం ముందే తెలుసు. నా జాతకంలో అలాగే ఉంది అని కళ్యాణి తెలిపింది. తాను జీవితంలో మోసపోయినది ఏదైనా ఉందంటే అది ప్రేమ, పెళ్లి వలనే అని కళ్యాణి తెలిపింది.

దూకుడు స్వభావం
ఇండస్ట్రీలో దూకుడుగా వ్యవహరించి పలు సందర్భాల్లో విమర్శలపాలు అయ్యావు.. ఎందుకు అని అలీ అడగగా.. తనకు స్వతహాగానే దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉందని కళ్యాణి తెలిపింది. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీ విషయంలో ఏదైనా చెడుగా జరుగుతుంటే చూస్తూ ఉండలేనని కళ్యాణి తెలిపింది. పేద కుటుంబం నుంచి రావడం వలన నాకు ఉన్నంతలో అందరికి సాయపడుతుంటానని కళ్యాణి తెలిపింది.


Click it and Unblock the Notifications











