Kasthuri Shankar: టెలివిజన్ నటి కస్తూరి అరెస్ట్.. హైదరాబాద్‌లో తమిళ పోలీసుల అదుపులోకి!

Kasthuri Shankar: తెలుగు ప్రజలపై ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో చైన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసుల సహకారంతో నటి కస్తూరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు. క‌స్తూరి ముంద‌స్తు బెయిల్ పిటీష‌న్ల‌ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే.. ఇటీవల చెన్నైలో హిందూ మక్కల్‌ కట్చి ఆధ్వర్యంలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటి కస్తూరి కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు దశాబ్దాల క్రితం రాణుల దగ్గర సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారనీ, కానీ వారి గుర్తింపు తెలియకుండా తమిళులుగా చలామణి అవుతున్నారనీ, పరోక్షంగా తెలుగువారిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Actress Kasthuri Shankar was arrested in Gachibowli hyderabad by Chennai police

దీంతో ఆమె చిక్కుల్లో పడింది. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆమె వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తెలుగువారిపై చిన్న చూపు చూస్తున్నారనీ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొన్నారు.

ఇలా తెలుగు సంఘాలపై ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. ఈ కేసుకు సంబంధిచిన సమన్లు ఇవ్వడానికి పోలీసులు పోయెస్‌ గార్డెన్‌లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. కానీ, తన ఇంటికి తాళం వేసి ఉంది. అలాగే.. ఆమె సెల్‌ ఫోన్‌ స్విచాఫ్‌ చేయడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆమెను గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఉన్నట్టు గుర్తించిన చెన్నై పోలీసులు ఇక్కడికి వచ్చి ఆమెను అరెస్టు చేశారు.

More from Filmibeat

Read more about: kasthuri shankar tamilnadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X