నిత్యానంద క్యాంపులో చేరిన మరో హీరోయిన్

తరచూ బెంగళూరులో ఉన్న నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి ప్రార్థన, ఇతరకార్యక్రమాల్లో పాల్గొంటూ అధిక సమయాన్ని అక్కడే గడుపుతోంది. ఆశ్రమ కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. యోగ, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న కౌసల్యకు నిత్యానంద ఆశ్రమంలో ముఖ్య పదవి లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. నిత్యానందకు ప్రధాన శిష్యురాలి హోదా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది.
32 ఏళ్ల కౌసల్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ పలు డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాలేదు. స్వామి ఈ నెప్పిని చేతితో తీసేసినట్లు మాయం చేసారని అంటోంది. ఈమె కాలమెల్లాంకాదల్ వాల్గ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రియముడన్, ఉన్నుడన్, వానత్తైల, మనదై తిరిడి విట్టాయే మొదలగు చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించిన కౌసల్య చివరగా సంతోష సుబ్రమణియం చిత్రంలో నటించింది.
ఇక రెండేళ్ల క్రితం నిత్యానంద, రంజిత రాసలీలల సిడిలు పలు టీవి చానళ్లలో ప్రసారమైన విషయం తెలిసింది. ఇవి సంచలనం సృష్టించాయి. దీనికి సంబంధించి అప్పట్లో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. వీడియో సిడిలలో ఉన్నది తాము కాదని నిత్యానంద, రంజిత చెబుతున్నారు. దీంతో వీడియోలో ఉన్నది వారా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు పరీక్షలు చేయాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. దీనిపై తమకు సహకరించాలని నిత్యానందకు అప్పట్లో పలుమార్లు నోటీసులు అందజేశారు. అయితే నిత్యానంద మాత్రం స్పందించలేదు. నిత్యానందస్వామి ఎన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్నా ఆయనపై తారలకు మోహం తగ్గడం లేదనడానికి నిదర్శనం నటి కౌసల్య. రంజిత అనంతరం ఇటీవల మరో నటిపై నిత్యానంద పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











