twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యానంద క్యాంపులో చేరిన మరో హీరోయిన్

    By Srikanya
    |

    Kausalya
    బెంగుళూరు : ప్రముఖ నటి రంజితతో రాసలీలల కేసులో ఇరుక్కున్న నిత్యానంద క్యాంపులో మరో మాజీ హీరోయిన్ జాయినైంది. తెలుగులో సైతం కొన్ని సినిమాలు చేసిన ఆమె తన వెన్ను నెప్పి స్వామి దయతో నయమైందని,అందుకే జాయినయ్యానని చెప్తోంది. నిత్యానంద స్వామి హీలింగ్ చికిత్సలో నిపుణత్వమై ఆయనపై భక్తి కలిగేలా చేసిందంటోంది. కౌసల్య నిత్యానంద ఆశ్రమం వెళ్లి హీలింగ్ చికిత్స పొందింది. ప్రస్తుతం వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోవడం కౌసల్య నిత్యానంద శిష్యురాలిగా మారింది.

    తరచూ బెంగళూరులో ఉన్న నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి ప్రార్థన, ఇతరకార్యక్రమాల్లో పాల్గొంటూ అధిక సమయాన్ని అక్కడే గడుపుతోంది. ఆశ్రమ కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. యోగ, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న కౌసల్యకు నిత్యానంద ఆశ్రమంలో ముఖ్య పదవి లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. నిత్యానందకు ప్రధాన శిష్యురాలి హోదా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది.

    32 ఏళ్ల కౌసల్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ పలు డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాలేదు. స్వామి ఈ నెప్పిని చేతితో తీసేసినట్లు మాయం చేసారని అంటోంది. ఈమె కాలమెల్లాంకాదల్ వాల్గ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రియముడన్, ఉన్నుడన్, వానత్తైల, మనదై తిరిడి విట్టాయే మొదలగు చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించిన కౌసల్య చివరగా సంతోష సుబ్రమణియం చిత్రంలో నటించింది.

    ఇక రెండేళ్ల క్రితం నిత్యానంద, రంజిత రాసలీలల సిడిలు పలు టీవి చానళ్లలో ప్రసారమైన విషయం తెలిసింది. ఇవి సంచలనం సృష్టించాయి. దీనికి సంబంధించి అప్పట్లో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. వీడియో సిడిలలో ఉన్నది తాము కాదని నిత్యానంద, రంజిత చెబుతున్నారు. దీంతో వీడియోలో ఉన్నది వారా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు పరీక్షలు చేయాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. దీనిపై తమకు సహకరించాలని నిత్యానందకు అప్పట్లో పలుమార్లు నోటీసులు అందజేశారు. అయితే నిత్యానంద మాత్రం స్పందించలేదు. నిత్యానందస్వామి ఎన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్నా ఆయనపై తారలకు మోహం తగ్గడం లేదనడానికి నిదర్శనం నటి కౌసల్య. రంజిత అనంతరం ఇటీవల మరో నటిపై నిత్యానంద పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

    English summary
    Actress Kausalya had unchanging behind pain. It was not marinated even after medication. Nithyananda is consultant in recovering process. So, Kausalya went to Nithyananda’s ashram and perceived recovering therapy. Now, she is out of behind pain. Now, Kausalya is footman of Nithyananda. Also, she is participating in prayers in Nithyananda ashram. Currently, Kausalya resides for prolonged in a ashram. Also, she takes partial in ashram duties.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X