»   » శ్రీదేవి పర్సనల్ విషయాలు కెలికావ్, ఆమె ఉంటే నీ నోరు మూయించేది!

శ్రీదేవి పర్సనల్ విషయాలు కెలికావ్, ఆమె ఉంటే నీ నోరు మూయించేది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్విట్టర్లో పలు సంచలన విషయాలు బయట పెడుతూ, కాంట్రవర్సల్ కామెంట్స్ చేస్తూ వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.... శ్రీదేవి అంటే పడి చస్తాడు. ఆమెను అమితంగా ఆరాధించే వర్మ అతిలోక సుందరి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఎంతో ఆసక్తితో తెలుసుకునేవాడు. శ్రీదేవితో చిత్రాలు తీస్తున్న సమయంలో ఆమె జీవితాన్ని చాలా దగ్గర నుండి పరిశీలించాడు.

Sridevi : నాకు ఆ పిల్ల అంటే ఇష్టం, ఆ పిల్లకి ఏం అన్న అయితే ?
 శ్రీదేవి పర్సనల్ విషయాలు లీక్ చేసిన వర్మ

శ్రీదేవి పర్సనల్ విషయాలు లీక్ చేసిన వర్మ

శ్రీదేవి మరణం తర్వాత రామ్ గోపాల్ వర్మ పలు సంచలన విషయాలు బయట పెట్టారు. శ్రీదేవి అభిమానులకు నా ప్రేమ లేఖ అంటూ..... శ్రీదేవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు బయటకు చెప్పుకోకుండా అత్యంత గోప్యంగా ఉంచుకున్న విషయాలను వర్మ లీక్ చేశాడు.

వర్మ తీరుపై మండిపడ్డ నటి కవితా కౌశిక్

వర్మ తీరుపై మండిపడ్డ నటి కవితా కౌశిక్

శ్రీదేవి ఇప్పటి వరకు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని, ఇంతకాలం తన మనసులో దాచుకున్న పలు విషయాలు వర్మ బయట పెట్టడంపై నటి కవిత కౌశిక్ మండి పడ్డారు. వర్మ ఇలా చేయడం సమంజసం కాదంటూ ఫైర్ అయ్యారు.

 ఆమె ఉంటే మీ నోరు మూయించేవారు

ఆమె ఉంటే మీ నోరు మూయించేవారు

రామ్ గోపాల్ వర్మ చాలా తప్పు చేస్తున్నావు. మీరు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న విషయాలను అడ్డుకునేందుకు ఆమె ఇక్కడ లేరు. ఒక వేళ శ్రీదేవి బ్రతికి ఉంటే మీ నోరు మూయించేవారు.... అని కవితా కౌశిక్ మండి పడ్డారు.

ప్రతి వ్యక్తి జీవితంలో పర్సనల్ పేజీలు ఉంటాయి

ప్రతి వ్యక్తి జీవితంలో పర్సనల్ పేజీలు ఉంటాయి

ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని పర్సనల్ పేజీలు ఉంటాయి. వారి ప్రమేయం లేకుండా అందరూ చదివేలా ఆమె లైఫ్ బుక్‌లోని పేజీలను మీరెందుకు ఓపెన్ చేస్తున్నారు? ఆమె ఇది కోరుకోవడం లేదు. ఇలా చేయకండి'' అంటూ కవిత కౌశిక్ ట్వీట్ చేశారు.

 ఆమెను ఎంతగానో ఆరాధించాను

ఆమెను ఎంతగానో ఆరాధించాను

వర్మ తన ట్విట్టర్ లేఖలో పలు సంచలన విషయాలు, శ్రీదేవి జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని సంగతులు ఉన్నాయి. ఆమె అందాన్ని, టాలెంటును పొగుడుతూనే ఆమె జీవితంలోని చీకటి పేజీలను ఓపెన్ చేశారు.

 సంచలన విషయాలు

సంచలన విషయాలు

చాలా మంది శ్రీదేవి జీవితం పర్‌ఫెక్ట్ అని భావిస్తుంటారు. అందమైన ముఖం, గ్రేట్ టాలెంట్, ఇద్దరు కూతుళ్లతో మంచి ఫ్యామిలీ..... బయటి నుండి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ శ్రీదేవి హ్యాపీ లైఫ్ లీడ్ చేసిందా? అంటే చెప్పాల్సింది చాలా ఉంది అంటూ వర్మ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.

 తండ్రి మరణం తర్వాత పంజరంలో పక్షిలా

తండ్రి మరణం తర్వాత పంజరంలో పక్షిలా

నేను శ్రీదేవిని కలిసి సమయం నుండి ఆమె జీవితం గురించి తెలుసు. నా కళ్లతో ఆమె జీవితాన్ని చాలా దగ్గరుండి చూశాను. ఆమె తండ్రి మరణించే ముందు వరకు ఆమె జీవితం ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉండేది. కానీ ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండే ఆమె తల్లి వల్ల ఆమె జీవితం పంజరంలో పక్షిలా మారింది... అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

 అప్పట్లో అంతా బ్లాక్ మనీ, మోసం చేశారు

అప్పట్లో అంతా బ్లాక్ మనీ, మోసం చేశారు

అప్పట్లో నటీనటులకు నిర్మాతలు ఎక్కువగా బ్లాక్ మనీ చెల్లించేవారు. ఐటి రైడ్స్ భయంతో ఆమె తండ్రి డబ్బును నమ్మకమైన తన స్నేహితులు, బంధువుల వద్ద దాచేవారు. అయితే శ్రీదేవి తండ్రి మరణంతో వారంతా డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆమెను మోసం చేశారు అని వర్మ చెప్పుకొచ్చారు.

 తల్లి వల్ల డబ్బంతా పోయింది

తల్లి వల్ల డబ్బంతా పోయింది

శ్రీదేవి తల్లి లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీలు కొనుగోలు చేసింది. ఆమె చేసిన ఇతర తప్పులు కూడా శ్రీదేవి డబ్బు అంతా కరిగిపోయేలా చేసింది. బోనీ కపూర్ శ్రీదేవి జీవితంలోకి ప్రవేశించే సమయానికి ఆమె వద్ద ఎలాంటి ఆస్తులు లేకుండా అయిపోయాయి అని.... వర్మ తన లెటర్లో చెప్పుకొచ్చారు.

 సోదరి మోసం చేసింది

సోదరి మోసం చేసింది

శ్రీదేవి తల్లికి యూఎస్ఏలో బ్రెయిన్ సర్జరీ తప్పుగా జరుగడం వల్ల ఆమె మెంటల్ పేషెంట్ అయిపోయింది. తర్వాత శ్రీదేవి చెల్లెలు శ్రీలత తన ఇంటి పక్కన ఉండే వ్యక్తిని పారిపోయి పెళ్లి చేసుకుంది. శ్రీదేవి మదర్ చనిపోయే ముందు ఆస్తులన్నీ శ్రీదేవి పేరు మీదనే రాసింది. కానీ శ్రీదేవి సోదరి ఆమెపై కేసు వేసింది. వీలునామా రేసే సమయంలో తన తల్లి మాసినకంగా సరిగా లేదని చెప్పి శ్రీదేవి వద్ద నుండి ఆస్తి లాక్కుంది అని..... రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

 బోనీ తల్లి శ్రీదేవిని పబ్లిక్‌గా కొట్టింది

బోనీ తల్లి శ్రీదేవిని పబ్లిక్‌గా కొట్టింది

బోనీ కపూర్ తల్లి శ్రీదేవిని ఇష్టపడలేదు. ఆమె వల్ల తన ఇల్లు ముక్కలవుతుందని చిత్రీకరించింది. శ్రీదేవిని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో పబ్లిగ్గా కడుపులో కొట్టింది. ఇదంతా ఆమె బోనీ కపూర్ మొదటి భార్య మోనా కోసమే చేసింది.... అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

 ఎవరికీ తెలియవు

ఎవరికీ తెలియవు

ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను రామ్ గోపాల్ వర్మ బయట పెట్టడంతో అభిమానులు సైతం షాకవుతున్నారు. పైకి అందంగా కనిపించే శ్రీదేవి జీవితం వెనక ఇంతవిషయం దాగి ఉందా? అని ఆశ్చర్య పోతున్నారు.

మరణం కూడా మిస్టరీనే

మరణం కూడా మిస్టరీనే

శ్రీదేవి జీవితం మాదిరిగానే, ఆమె మరణం కూడా చాలా మిస్టరీగా ఉంది. దుబాయ్ లో ఆమె అత్యంత దయనీయ స్థితిలో మరణించడం అందరినీ కలిచి వేస్తోంది. దీంతో పాటు తాజాగా వర్మ బయట పెట్టిన విషయాలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి.

English summary
"Bohot galat kar rahe hain aap! she is not here to defend herself or shut you up from revealing details of her personal life which you admit she guarded more than her life ! Why will you open the pages of her life’s book for everyone to read? She did not want this!! Don’t do this!" Actress Kavita Kaushik furious tweet on RGV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu