కారు డ్రైవర్ తో ...సినీనటి కవిత కుమార్తె ప్రేమ వివాహం

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన రాజ్‌కుమార్(28) మూడేళ్లుగా సికింద్రాబాద్‌లో ఉంటూ మాధురి కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఎంబీఏ చదువుతున్న మాధురిని కాలేజీకి తీసుకువెళుతున్న క్రమంలో ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ప్రేమకు దారితీసింది.
వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారు అడ్డుచెప్పారు. ఈక్రమంలో రెండు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన మాధురి గురువారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో రాజ్‌కుమార్‌తో కలిసి ప్రత్యక్షమయ్యారు. దళిత నేతల సమక్షంలో వెంకటేశ్వరాలయంలో వివాహం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మాధురి బంధువుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో రాజ్‌కుమార్‌పై కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు పెద్దపల్లికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి, వివాహం చేసుకున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











