Actress Kavitha ఇంట్లో తీరని విషాదం కొడుకు చనిపోయిన కొన్ని రోజులకే భర్త మృతి!
కరోనా మొదదలైనప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో విషాధాలు కనిపిస్తున్నాయి. ఎటువైపు నుంచి ఏ చావు వార్త వినాల్సి వస్తుందో అని అన్ని వర్గాల జనాలు సతమవుతున్నారు. సెలబ్రేటీలు కూడా ఈ కరోనా వలన తీవ్ర స్థాయిలో నష్టాలు ఎదుర్కొన్నారు. ఇక సీనియర్ నటి కవిత ఇంట్లో కూడా రెండు వారాల వ్యవధిలోనే రెండు మరణాలు చోటు చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.

350కు పైగా సినిమాల్లో
సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కవిత 11 ఏళ్ళ వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కొన్ని సినిమాల్లో మేజర్ రోల్స్ కూడా చేసింది. ఇక కాలం మారుతున్న కొద్దీ ఆమె కూడా నటనలో మార్పులు తీసుకువస్తూ.. భాషతో సంబంధం లేకుండా సౌత్ లో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు.

కొడుకు మృతి
సినీ పరిశ్రమలో కవిత అంటే తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందరితోనూ ఆమె హ్యాపీగా సన్నిహితంగా ఉంటారు. అయితే పది రోజుల క్రితమే కొడుకు మృతికి ఒక్కసారిగా కృంగిపోయిన కవితకు వెంటనే మరో షాక్ తగలడం అందరిని కలచివేసింది.

తీరని విషాదం
ఆమె ఇంట్లో కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు సంజయ్ రూప్ రెండు వారాల క్రితం కొవిడ్‌తో మృతి చెందాడు. చివరి నిమిషం వరకు కొడుకు బ్రతుకుతాడు అని ఎంతో నమ్మకంతో ఉన్న కవితకు చివరకు నిరాశే మిగిలింది. ఇక అప్పటికే కరోనా భారిన పడిన ఆమె భర్త దశరథరాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు.

భర్త మృతి చెందడంతో..
ఇటీవల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఆయన కూడా ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. కొడుకు మృతితో ఇన్ని రోజులు తీవ్ర మనోవేదనకు గురైన కవితకు ఇప్పుడు భర్త మరణం కూడా ఆమెకు కోలుకోలేని విషధాన్ని మిగిల్చింది. దీంతో సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











