కుష్బూకి అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక.. అసలు ఏం జరిగిందంటే?
కుష్బూ సుందర్.. 90ల్లో ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల సరసన నటించి.. ప్రేక్షకులను అలరిచింది. అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చి బీజేపీలో చేరి.. ప్రజలకు సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్న కుష్బూ.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనితో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...
ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు..:హీరోయిన్ కుష్బూ... తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటి గానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేసింది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ నాయకురాలిగా ప్రజలకు సేవను అందిస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పదవి చేపట్టింది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతిపక్షాలకు తనదైన రీతిలో మాటలను వదులుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

కుష్పూ చేసిన పోస్ట్ వైరల్:అయితే తాజగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆసుపత్రి బెడ్ పై ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన నటిని ఇలా బెడ్ పై చూసి తట్టుకోలేకపోతున్నారు. ఏమైందీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆసుపత్రి పాలైన కుష్పూ:కుష్పూ చేసిన పోస్టులో... తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పుకొచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఇలా అన్నీ వచ్చేశాయని చెప్పుకొచ్చింది. తనకు ఎడినో వైరస్ సోకిందని.. చాలా కష్టంగా అనిపిస్తోందంటూ రాసుకొచ్చింది. వైరస్ సోకినట్టుగా ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి అంటూ సూచించింది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోండని కుష్బూ హితవు పలికింది. అయితే ఈ పోస్టును చూసిన నెటిజన్లు.. మేడం మీరు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష:కుష్పూ విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు సుందర్ ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. నటిగా సౌత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె రాజకీయాలపై ఆసక్తితో 2010 లో డీఎంకే పార్టీలో చేరింది. ఆ తర్వాత నాలుగేళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి మారి.. 2020 వరకూ కాంగ్రెస్ లో పనిచేసింది. ఆ తర్వాత కుష్బూ తర్వాత బీజేపీలో చేరింది. అప్పటి నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుష్బూ పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత అధిష్టానం ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఇక సినిమాలు, టీవీ షో లలో కూడా పాల్గొంటు బిజీగా ఉండగా.. ప్రస్తుతం అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరింది.


Click it and Unblock the Notifications











