»   » నటి పై దారుణం., వెంటాడి వెంటాడి రోడ్డుమీదే చంపారు

నటి పై దారుణం., వెంటాడి వెంటాడి రోడ్డుమీదే చంపారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాకిస్థాన్లో నటీమణులూ , మోడళ్ల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతం లో మోడలింగ్ చేస్తున్నందుకుకండిల్ బలోచ్ అనే నటిని సొదరుడే హతమార్చి కొన్ని నెలలు కూడా గడవకుందానే గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో నటి ఒకరు తీవ్రంగా గాయపడి ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని అయిన లాహోర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ స్టేజ్‌షోలో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వస్తున్న నటి కిస్మత్ బేగ్‌పై కారు, మోటార్‌ సైకిలుపై వచ్చిన దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

11సార్లు కాల్చారు:

11సార్లు కాల్చారు:

బేగ్ కాళ్లు, పొట్ట, కాళ్లపై 11సార్లు కాల్చారు. తీవ్రంగా గాయపడిన బేగ్, ఆమె కారు డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కారు డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు దర్యాప్తు అధికారి అస్గర్ హుస్సేన్ తెలిపారు.

వెంటాడి మరీ :

వెంటాడి మరీ :

బేగ్ నుంచి విడిపోయిన ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ పథకం ప్రకారమే ఆమెను హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. థియేటర్ బయట వేచి ఉన్న దుండగులు ఆమె బయటకు రాగానే వెంటాడి మరీ కాల్చారని పోలీసులు తెలిపారు.

గతంలోనూ:

గతంలోనూ:

‘కిస్మత్ ఇక నుంచి నీవు డ్యాన్స్ చేయలేవు'' అని దుండగుల్లో ఒకరు కాల్చుతూ అరిచినట్టు పేర్కొన్నారు. బేగ్‌పై గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం జరిగినా ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దర్యాప్తు అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఇంటి పరువును బజారుకు ఈడ్చిందని:

ఇంటి పరువును బజారుకు ఈడ్చిందని:

ఇంటర్నెట్ సంచలనం, పాకిస్థానీ మోడల్, నటి అయిన కండీల్ బలోచ్‌ను ముల్తాన్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆమె సోదరుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవలే కండీల్ బలోచ్ తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు సెక్యూరిటీ పెంచాలని కోరింది. కానీ ఆలోగానే ఆమెను హత్య చేసిన సోదరుడు వసీమ్మా అక్క మా ఇంటి పరువును బజారుకు ఈడ్చిందని, దానిని తాను సహించలేకపోయానని, అందుకే ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

విరాట్ కోహ్లీతో డేటింగ్:

విరాట్ కోహ్లీతో డేటింగ్:

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేయాలని తన మనసులోని కోరికను బహిరంగంగా వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

English summary
Stage actor Kismat Baig who was shot eight times by unidentified gunmen in Lahore died on Thursday evening
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X