twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనితో డేటింగ్‌ అద్బతం

    By Staff
    |

    Koena Mitra
    తన డేటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకుంది బాలీవుడ్ చిన్నది కొయినా మిశ్రా. టర్కీ దేశానికి చెందిన పైలట్‌ మెట్‌ మెరిల్‌తో గత కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న ఆమె డేటింగ్‌ సక్సెస్‌ ఫుల్‌గా జరుగుతోందని ఆనందంగా చెబుతోంది. అలాగే తన అనుభూతిని వివరిస్తూ 'డేటింగ్‌లో మేమిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. మెరిల్‌ నాకు పరిచయమైన కొత్తలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా అనిపించాడు. అలా అనిపించడమే అతనితో నా స్నేహం పెరగడానికి కారణమైంది.

    ఇప్పుడు డేటింగ్‌లో అతను చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా అర్థం చేసుకున్నాను. మా స్నేహం చిరకాలం కొనసాగుతుందన్న నమ్మకం డేటింగ్‌ సందర్భంగా నాకు కలిగింది. మా స్నేహం చిరకాల బాంధవ్యంగా మారినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇటీవల పలు ఫంక్షన్లకు మెరెల్‌ను నాతోపాటు తీసుకువెళ్లి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులకు పరిచయం చేశాను. మంచి ఫ్రెండ్‌ను ఎంపిక చేసుకున్నావని వారంతా నన్ను అభినందించారు' అని అంటోంది. ఆమె తన డేటింగ్ అనుభవాలను ఇలా చెప్పటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X