కరెంట్ వైర్లతో కాల్చి, గొంతు పిసికి నా భర్తని చంపించింది.. హీరోయిన్ పై నటి సంచలన వ్యాఖ్యలు

సినిమా విషయాల మీద జనానికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సినీ పరిశ్రమలో సినిమా కధలకు మించిన విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ విషయాలు బయటకు మాత్రం రావు. వచ్చినా ఒకటీ అరా శాతం అంతే. నిజానికి లోకం పోకడే అలా తయారయింది. కానీ గ్లామర్ ఫీల్డ్ కావడంతో సినిమా పరిశ్రమ మీద అందరి కళ్ళూ ఉంటాయి. మంచి స్థాయికి ఎదుగుతున్నాడు అనే కారణంగా తన భర్త, టాలీవుడ్ డైరెక్దర్ అయినా రాజాచంద్రను ఒక హీరోయిన్ చంపించింది అంటూ నటి కృష్ణ వేణి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

నిలదొక్కుకోలేక

నిలదొక్కుకోలేక

ప్రస్తుత జనరేషన్ కు బామ్మ పాత్రలతో పరిచయం అయిన కృష్ణ వేణి వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే హీరోయిన్ గా నటించిన రెండు సినిమాల్లో ఒకటి రిలీజ్ కు నోచుకోలేదు.. మరొకటి ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అందం అభినయం ఉన్నా హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయారు కృష్ణవేణి. అయితే తెలుగులో ఆమె హాస్య నటిగా చాలా సినిమాలు చేసింది.

విడాకులు

విడాకులు

90ల్లో వందల సినిమాలు చేసిన ఆమె ఒకానొక సమయంలో పూట గడవడానికి కూడా కష్టం అయిందని.. అలాంటి సమయంలో అమెరికాలో ఓ 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా కూడా పని చేశానని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కృష్ణవేణి. అంతే కాక కృష్ణవేణికి 10 ఏళ్ల వయసుకే తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. 13 ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యిందట. అయితే భార్య భర్తల మధ్య వచ్చిన బేధాభిప్రాయాలు రావడంతో కృష్ణ వేణి విడాకులు తీసుకున్నారు.

పెళ్లి దాకా వెళ్లి

పెళ్లి దాకా వెళ్లి

కుటుంబ పోషణ కోసం సినిమాల్లో, సీరియల్స్ లో ఏ చిన్న పాత్రలు ఇచ్చినా కాదనకుండా నటించింది. తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో అమెరికాకు వెళ్ళిపోయి ఓ ఇంట్లో వృద్ధుడికి కొన్ని రోజుల పాటు కేర్ టేకర్‌గా కొనసాగింది. అయితే ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అతనిని చంపేశారు అని ఆమె ఆరోపించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలో వారాలబ్బాయి, శ్రీమతి గారు, ముగ్గురు మిత్రులు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు రాజాచంద్రతో పరిచయం ఏర్పడి అది పెళ్లి దాకా వెళ్లిందని అన్నారు.

మంచి ఫ్యామిలీ సినిమాలు

మంచి ఫ్యామిలీ సినిమాలు

రాజాచంద్ర ప్రతిభావంతుడైన దర్శకుడు. ఒకసారి సెట్స్ లో నన్ను తిడితే ధీటుగా బదులిచ్చాను, ఆ తర్వాత ఆయనతో చనువు ఏర్పడిందని ఆమె పేర్కొంది. టీ నల్లగా ఉన్నా నేను తాగను. నలుపంటే అసలు నచ్చదు నాకు. కానీ నల్లగా ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని తమ వివాహం తర్వాత ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు వంద రోజులు ఆడాయని, మంచి ఫ్యామిలీ సినిమాలు చేశారని పేర్కొంది.

కరెంటు వైర్లు పెట్టి మరీ

కరెంటు వైర్లు పెట్టి మరీ


ఆయన ఎదుగుదల ఓర్వలేక కొందరు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని, కానీ అసలు వాస్తవం నాకు తెలుసని ఆమె పేర్కొంది. రాజా చంద్ర హత్య వెనుక ఓ ప్రముఖ హీరోయిన్ హస్తం ఉందని పేర్కొన్న ఆమె కరెంటు వైర్లు పెట్టి, కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేయించింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. కానీ ఆ హీరోయిన్ పేరు చెప్పని ఆమె ఆ హీరోయిన్ కూడా షుగర్ తో దారుణంగా చనిపోయింది అని, పాపం అనుభవించింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ హీరోయిన్ తో పాటు కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఈ హత్య వెనుక ఉన్నారని, పోలీసులు కూడా తాము ఏమీ చేయలేము అని మీకు భద్రత కల్పిస్తామని అన్నారని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Read more about: నటి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X