»   »  దారుణం... కన్యత్వాన్ని వేలం వేసిన నటిపై అత్యాచారం

దారుణం... కన్యత్వాన్ని వేలం వేసిన నటిపై అత్యాచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెర్మ్: ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఓ నటి తన కన్యత్వాన్ని 10వేల పౌండ్లకు వేలం పెట్టింది. అమ్మానాన్నలను కోల్పోయి ఒంటరిగా ఉన్న ఆ నటి తన కన్యత్వాన్ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బుతో కెరీర్లో కెరీర్ ఎదుగుదల పరంగా ఉపయోగించు కోవాలనుకుంది. కానీ ఆమె ప్లాన్ తిరిగబడింది. వేలంలో ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్న ఓ వ్యక్తి ఆ డబ్బు ఇస్తానని చెప్పి తన ఫ్లాటుకు పిలిపించుకుని ఆమెను మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

సెంట్రల్ రష్యాలోని పెర్మ్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అజెర్‌బైజన్(మాజీ సోవియట్ యూనియన్ లోని దేశం) అనే దేశానికి చెందిన క్రిష్టినా అనే నటి 10వేల పౌండ్లకు ఆన్ లైన్ లో తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. మిఖాయిల్ ద్నిస్ట్రియన్ అనే వ్యక్తి ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్నాడు.

Actress Kristina who wanted to sell her virginity for £10,000 is raped by 'buyer'

తన ఫ్లాటుకు వస్తే నీ కన్యత్వాన్ని స్వీకరించి డబ్బు ఇస్తానని ఆశ పెట్టాడు. ఇందుకోసం ఆమె దాదాపు 2000 మైల్స్ ప్రయాణించి సెంట్రల్ రష్యాలోని పెర్మ్ నగరంలోని మిఖాయిల్ ద్నిస్టియన్ ఫ్లాటుకు చేరుకుంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అతను ఆమెను మోసం చేసి వేలం డీల్ కు వ్యతిరేకంగా ఆమెను తనతో నగ్న ఫోటో షూట్ కోసం బలవంతం పెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి రేప్ చేసాడు. తర్వాత ఆమెను బ్రోతల్ హౌస్ కు విక్రయించాలని ప్లాన్ చేసాడు.

అతడు బయటకు వెళ్లిన సమయంలో క్రిస్టినా అతని ప్లాట్ నుండి తప్పించుకుంది. మూడో ఫ్లోర్ లో ఉన్న అతని ఫ్లాట్ కిటికీ నుండి బెడ్ షీట్ల సహాయంతో కిందకు దిగింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారించగా అతడు ఒక రకమైన మానిసక రోగి అని, గతంలోనూ ఇతడు ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డట్లు గుర్తించారు.

English summary
A 28-year old aspiring Azerbaijani actress named Kristina put up her virginity for sale online for £10,000 and ended up being raped by her buyer, Mikhail Dnistrian. The lady traveled more than 2,000 miles all the way from Azerbaijan to central Russia's Perm to meet her buyer.
Please Wait while comments are loading...