ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటి ఖుష్బూ
తమిళ ప్రేక్షకుల ఆరాధ్య నటి ఖుష్బూ ప్రమాదంలో గాయపడింది. దిలీప్ హీరోగా నటిస్తుండగా, ఖష్బు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న'మరుమగన్' అనే మలయాళ సినిమా షూటింగులో ఆమె ప్రమాదానికి గురైంది. మేడమెట్లు దిగే నప్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు మెట్లు విరిగిపడి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కేరళలోని కొచ్చిలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ ప్రమాదంలో ఆమె ఎడమకాలు విరిగిందని డాక్టర్లు నిర్ధారించి, చికిత్స ప్రారంభించారు. ఆమె కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించిన ఖుష్బూ, తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తమిళనాడులో అప్పట్లో ఆమెకు గుడి కూడా కట్టి పూజించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే!


Click it and Unblock the Notifications











