త్రివిక్రమ్ చెప్పినవేవి నచ్చలేదు?.. పవన్ గురించి చెప్పాలంటే?: కుష్బూ
'అజ్ఞాతవాసి'పై అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అన్నీ ఇన్నీ కాదు. అసలు పవన్ కల్యాణ్ ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడని ఫ్యాన్సే గగ్గోలు పెడుతున్నారు. సినిమాలో ఏ ఒక్క క్యారెక్టరైజేషన్‌ను త్రివిక్రమ్ సరిగా హ్యాండిల్ చేయలేదని విమర్శిస్తున్నారు. కానీ ఒక్క ఖుష్బూ పాత్ర మాత్రం 'సెంటిమెంట్' వరకు ఆకట్టుకుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Recommended Video


సినిమాల్లో ఎందుకింత గ్యాప్?:
చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉన్నా. ఒక్క తెలుగే కాదు తమిళంలోనూ సినిమాలు ఒప్పుకోలేదు. ఒకవిధంగా ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకునేలా నా పాత్ర ఉండాలనుకున్నా. 'అజ్ఞాతవాసి'లో నా పాత్ర అలాంటిదే.

అవేవి నచ్చలేదు:
త్రివిక్రమ్ గతంలోనూ నాకు చాలా స్క్రిప్ట్‌లు వినిపించారు. కానీ, నాకెందుకో అవేవి నచ్చలేదు. కానీ ఈ పాత్ర గురించి నాకు వివరించినప్పుడు వెంటనే నచ్చేసింది.

'నో' చెప్పవద్దని:
'అజ్ఞాతవాసి'లో నా పాత్ర గురించి వివరించడానికి వచ్చినప్పుడు త్రివిక్రమ్ ఒక మాటన్నారు. 'మేడం.. ఈ పాత్రకు మాత్రం నో చెప్పవద్దు ప్లీజ్' అన్నారు. ఇంత మంచి పాత్ర ఇస్తే నేను మాత్రం ఎందుకు నో చెబుతాను.

పవన్ గురించి:
పవన్ చాలా కూల్. తక్కువగా మాట్లాడతారు. ఆయనతో నటించడం సౌకర్యంగా ఉంటుంది. చిత్ర యూనిట్ నన్ను కుటుంబంలో ఒకరిగా చూసుకున్నారు.

డబ్బింగ్:
నాకు తెలుగు మాట్లాడటం బాగా వచ్చు. కానీ, ఇందులో నా పాత్రకు సరిత అనే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారు. నేను డబ్బింగ్ చెప్పకపోతే సినిమాలో నాకేమైనా పడిన మార్కులు పోతాయా? లేదు కదా!, నా పాత్రకు సరిత లాంటి అమ్మాయి గొంతు సరిగ్గా సరిపోతుంది.


Click it and Unblock the Notifications











