twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సెక్స్' రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా!..: కుష్బూ, కాజల్, తాప్సీ, గౌతమి ఏమన్నారంటే?

    |

    Recommended Video

    సెక్స్-కండోమ్స్ పై కాజల్, తాప్సీ..!

    'ఇండియా టుడే కాంక్లేవ్‌ సౌత్‌' ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఉమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ లైఫ్‌: ద పర్సనల్‌ ఈజ్‌ పొలిటికల్‌' అనే కార్యక్రమంలో సినీ తారలు గౌతమి, ఖుష్బూ, తాప్సీ, కాజల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడిటర్ రాజ్‌దీప్ సర్‌దేశాయి పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

    ఇందులో భాగంగా 'ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దని కేంద్రం ఆదేశించింది. దీనిపై మీ అభిప్రాయమేంటి?' అని ఆయన సినీ తారలను సూటిగా ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు తారలు చెప్పిన సమాధానాలేంటో చూద్దాం..

    జనాభాను నియంత్రించాలి:కాజల్

    జనాభాను నియంత్రించాలి:కాజల్

    పెరుగుతున్న జనాభాను నియంత్రించాల్సిన అవసరముంది. పిల్లలను పుట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నవారిని ఈ కండోమ్ యాడ్స్ కొంతవరకైనా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నా.

     మా అమ్మకు కూడా మినహాయింపు లేదు; తాప్సీ

    మా అమ్మకు కూడా మినహాయింపు లేదు; తాప్సీ

    కాలుష్యపూరితమైన నగరం స్వర్గంగా మారుతుందేమో కానీ.. అత్యధిక జనాభా కలిగిన దేశం అన్న ముద్ర మాత్రం భారతదేశానికి పోదు. ఏదో అంశంలోనైనా మనం నం.1గా ఉన్నామని సంబరపడాల్సిందే. ఈ విషయంలో నా అభిప్రాయమిదే. ప్రతీ ఒక్కరూ ఆ కారణాలను అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో మా అమ్మకు కూడా మినహాయింపు లేదు.

     సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి: కుష్బూ

    సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి: కుష్బూ

    కండోమ్ యాడ్ డే టైమ్‌లో కూడా ప్రసారం చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నా. పిలల్లకు స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన పెంపొందించాలి.

     'సెక్స్' రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా..

    'సెక్స్' రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా..

    కండోమ్ ప్రకటనను మిడ్ నైట్ మసాలా లాగా రాత్రి 11గం. తర్వాతే ప్రసారం చేయాలనడం హాస్యాస్పదం. శృంగారం రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా. పగలు కూడా చేస్తుంటారు. కాబట్టి.. పగలు కూడా కండోమ్ ప్రకటనలు ప్రసారం చేయాలి.-కుష్బూ.

     కండోమ్ యాడ్స్‌పై గౌతమి

    కండోమ్ యాడ్స్‌పై గౌతమి

    కండోమ్ అనేది సంతానోత్పత్తిని తగ్గించడానికే కాదు సురక్షిత శృంగారానికి ముఖ్యం. ప్రైమ్ టైమ్ లోనే కండోమ్ యాడ్స్ అనేవి ఎక్కువమందికి చేరడం కోసమే అనుకుంటున్నా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల ఆరోగ్య రక్షణ కోసమేనని భావిస్తున్నా. రోగాలు సంక్రమించకుండా కండోమ్స్ రక్షిస్తాయి. వాదించాలంటే చాలా కారణాలు కనిపిస్తాయి. ఏదేమైనా కండోమ్ అనేది ప్రజారక్షణ కోసమే.

    English summary
    Actress Kushboo made sensational comments on Condom adds. She said it's a wrong decision from central to permit condom adds after 11pm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X