చెంప పగలగొట్టిన హీరోయిన్, గుంపులో అసభ్యంగా.. వీడియో వైరల్, ఏం జరిగిందంటే!

Recommended Video

Actress Kushboo Slaps Youth During Congress Rally In Bengaluru || Filmibeat Telugu

2019 సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ మొదలయింది. గత కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో అన్ని రాష్ట్రాల్లో సినీ తారలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చాలా మంది సినీ తారలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించారు.

బెంగుళూరులో ప్రచారం

బెంగుళూరులో ప్రచారం

ఖుష్బూ బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ కు మద్దతుగా ఏప్రిల్ 10న ప్రచారం నిర్వహించారు. ఖుష్బూ రిజ్వాన్ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుమిగూడారు. ఖుష్బూ రిజ్వాన్ ఇంటి నుంచి కారు ఎక్కేందుకు వెళుతుండగా ఆమెని కార్యకర్తలు చుట్టుముట్టారు. అక్కడున్న పోలీసులకు కూడా వారిని అదుపు చేయడం కుదరలేదు. ఆ సమయంలో ఓ కార్యకర్త ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

చెంప పగలగొట్టి

చెంప పగలగొట్టి

ఖుష్బూ కారు ఎక్కేందుకు వెళుతుండగా ఆమె సడెన్ గా వెనక్కు తిరిగి ఓ కార్యకర్త చెంప పగలగొట్టింది. అతడు అసభ్యంగా ప్రవర్తించడం వల్లే ఖుష్బూ అలా చేసిందని అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో సరిగా లేకపోవడం వలన సదరు వ్యక్తి ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సరిగా కనిపించడం లేదు. కానీ ఖుష్బూ అతడిని చెంప దెబ్బ కొట్టిన దృశ్యాలు మాత్రం ఉన్నాయి. ఖుష్బూ చెంపదెబ్బ కొట్టగానే నేనేం తప్పు చేశాను అంటూ ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

 మహిళలతో అసభ్యంగా

మహిళలతో అసభ్యంగా

సాగాయ్ రాజ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఖుష్బూ వీడియోని పోస్ట్ చేశాడు. గందరగోళ పరిస్థితుల్లో చాలా మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలంతా ఖుష్బూ లాగే ఉండాలి. కొంతమంది మహిళ రిపోర్టర్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది అంటూ సాగాయ్ రాజ్ చేసిన ట్వీట్ ని ఖుష్బూ రీట్వీట్ చేశారు.

పోలిసుల అదుపులో

ఖుష్బూ చెంపదెబ్బ కొట్టగానే సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖుష్బూ ప్రస్తుతం సినీ నిర్మాతగా, నటిగా, రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ఖుష్బూ ప్రస్తుతం విశాల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖుష్బూ భర్త సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. చలా కాలంగా ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X