భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయులు అత్యంత భావోద్వేగానికి గురయ్యే మ్యాచ్ ఇది మాత్రమే. క్రికెట్ అంటే ఆసక్తి లేని వారు సైతం ఈ మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు.
తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండటంతో పలువురు సెలబ్రిటీలు లైవ్‌లో ఎంజాయ్ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి మాంచెస్టర్ స్టేడియంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... మంచు లక్ష్మి చివరగా తెలుగులో వైఫ్ ఆఫ్ రామ్ మూవీలో నటించింది. గతేడాది తమిళంలో జ్యోతిక మూవీ 'కాట్రి మోళి'లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఒప్పుడు నిర్మాతగా పలు చిత్రాలు చేసిన ఆమె... నష్టాలు రావడంతో సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే... టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ పట్టిన భారత్ దంచి కొడుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 43.2 ఓటర్లలో 280 పరుగులు చేసింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(78 బంతుల్లో 57), రోహిత్ శర్మ (113 బంతుల్లో 140) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా బరిలో ఉన్నారు.
ఇండియా వరల్డ్ కప్ గెలవడం కంటే.. పాకిస్థాన్ మీద గెలుపునే భారతీయ అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌కు లేని విధంగా భారీ సంఖ్యలో ఇండియన్ ఫ్యాన్స్ ఇంగ్లండ్ చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











