»   » సచిన్, నాగార్జున బాటలో మంచు ఫ్యామిలీ కొత్త వ్యాపారం!

సచిన్, నాగార్జున బాటలో మంచు ఫ్యామిలీ కొత్త వ్యాపారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయా రంగాల్లో రాణిస్తూనే మరో వైపు అదనపు సంపాదన కోసం వివిధ వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారు ఎక్కువగా విలాసవంతమైన రెస్టారెంట్స్, హోటల్స్ లాంటి వ్యాపారాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సచిన్, నాగార్జున లాంటి వారు ఈ వ్యాపారాలు మొదలు పెట్టారు.

తాజాగా మంచు ఫ్యామిలీ కూడా రెస్టారెంట్స్, హోటల్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘మంచు' పేరుతో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే హోటల్స్, రెస్టారెంట్స్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

 Swach Bharat Telangana

ఆ సంగతి పక్కన పెడితే... మంచు విష్ణు నటించిన ‘డైనమైట్' మూవీ సెప్టెంబర్ 4న విడుదలవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్ర సాంగ్స్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైనమైట్ లో మంచు విష్ణు ఫుల్ ఇంటెన్స్ పాత్రలో సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ ఆకట్టుకుంటాడని అంటున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి'కి రీమేక్.

మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ అందించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్ర‌యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇటీవల అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

English summary
Actress Lakshmi Manchu is selected as Telangana brand ambassador for Prime Minister Narendra Modi's dream programme - Swachh Bharat.
Please Wait while comments are loading...