ఆ మూవీ షూటింగులో శ్రీహరిగారు నన్ను కొట్టారు: హీరోయిన్ లతాశ్రీ

Recommended Video

Actress Latha Sri Reveals Interesting Facts In Ali's Show || Filmibeat Telugu

తెలుగు, కన్నడ చిత్రాల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించిన నిన్నటి తరం హీరోయిన్ లతా శ్రీ తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న 'అలీతో సరదాగా' కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నుంచి అలీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు.

కెరీర్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ... తన అసలు పేరు లతా శ్రీ కాదని, తల్లిదండ్రులు పెట్టిన పేరు పద్మలత అని తెలిపారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత శ్రీలతగా పేరు మార్చుకున్నాను. ఆ పేరును 'లతా శ్రీ'గా మారిస్తే కలిసొస్తుందని చెప్పడంతో మరోసారి పేరు మార్చుకున్నట్లు వెల్లడించారు.

ఆ సినిమా విజయంతో వరుస అవకాశాలు

ఆ సినిమా విజయంతో వరుస అవకాశాలు

చిన్న తనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే డాన్స్ నేర్చుకున్నాను. పదోతరగతి చదువుతుండగా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘పోలీస్ భార్య' విజయం సాధించడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయని, అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనట్లు లతా శ్రీ తెలిపారు.

అమ్మ చనిపోయిన తర్వాత బంధువుల చేతిలో మోసపోయాను

అమ్మ చనిపోయిన తర్వాత బంధువుల చేతిలో మోసపోయాను

నేను చిన్న వయసులో సినిమాల్లోకి రావడం వల్ల తనకు సంబంధించిన అన్ని విషయాలు తనే చూసుకునేది. పూర్తిగా అమ్మ మీదే ఆధారపడటం అలవాటైపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత చాలా కష్టపడ్డాను. ఏది మంచి, ఏది చెడు గ్రహించలేక నష్టపోయాను. బంధువుల చేతిలో మోసపోయినట్లు లతాశ్రీ తెలిపారు.

నిజంగానే దెయ్యాన్ని చూశాను

నిజంగానే దెయ్యాన్ని చూశాను

ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో తాను నిజంగానే దెయ్యాన్ని చూసినట్లు లతాశ్రీ తెలిపారు. ఓ సారి రాత్రి ఆసుపత్రిలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ మధ్యలో నడచుకుంటూ ఆసుపత్రి పై అంతస్తుకి వెళ్లగా అక్కడ ఒక మహిళ తెల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని కూర్చుకుని ఉంది. నన్ను చూడగానే మాయమైపోయింది. తర్వాత ఆరా తీస్తే పై అంతస్తులో మార్చురీ ఉందని తెలిసింది. ఎవరు నమ్మినా, నమ్మక పోయినా నేను దెయ్యాన్ని చూసిన మాట నిజం... అని అతాశ్రీ స్పష్టం చేశారు.

'దొరబాబు' షూటింగ్ సమయంలో శ్రీహరి గారు కొట్టారు

'దొరబాబు' షూటింగ్ సమయంలో శ్రీహరి గారు కొట్టారు

శోభన్ బాబు హీరోగా వచ్చిన దొరబాబు సినిమా షూటింగ్ అరకులోయలోని వాటర్ ఫాల్స్ వద్ద జరుగుతుండగా కాలు జారి పడిపయాను. ఆ సమయంలో శ్రీహరి గారు దూకి నన్ను కాపాడారు. నా జుట్టు పట్టుకుని లాగి పైకి తీసుకొచ్చారు. జాగ్రత్తగా ఉండాల్సిన పనిలేదా? అంటూ ఆయన అందరి ముందు కొట్టారు. ఆయన అలా కొట్టడంతో అలిగాను... అని లతాశ్రీ గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X